Senior YSRCP leaders: ఒకప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress )రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం అంటే ఓ రేంజ్ లో ఉండేది. నేతల హడావిడి ఎక్కువగా నడిచేది. సమావేశం ఒక్క ఎత్తు అయితే.. సమావేశానికి హాజరయ్యే నేతల చిట్ చాట్ ప్రకంపనలు సృష్టించేది. వివాదాస్పద కామెంట్స్ చేసి రక్తి కట్టించేవారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిన్ననే జరిగిన పార్టీ ఇన్చార్జులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో నేతల్లో అస్సలు సందడి కనిపించలేదు. చాలామంది సీనియర్లు డుమ్మా కొట్టారు. ఉన్న నేతలు సైతం దిగాలుగా కనిపించారు. అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
Also Read: Jagan Quash Petition: వైసీపీలో టెన్షన్.. కోర్టుకు జగన్!
కొద్దిమంది నేతలు మాత్రమే..
నిన్నటి సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Ramachandra Reddy ), బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ధర్మాన కృష్ణ దాస్, పేర్ని నాని, ఆర్కే రోజా, తోట త్రిమూర్తులు లాంటి నేతలు మాత్రమే కనిపించారు. ధర్మాన కృష్ణ దాస్, అనిల్ కుమార్ యాదవ్, రాయలసీమ జిల్లాలకు చెందిన నేతలు హాజరు కాలేదు. ఇటీవల పల్నాడు జిల్లా పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలు నేపథ్యం, తనను నిందితుడిగా చేస్తూ విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడం.. తదితర కారణాలతో జగన్మోహన్ రెడ్డి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కానీ చాలామంది సీనియర్లు హాజరు కాకపోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.
పదవులు అనుభవించిన వారు సైతం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించిన వారు.. ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో ఉన్నవారు అంతగా యాక్టివ్ గా లేరు. అటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న కొద్ది మంది మాత్రమే పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపిస్తున్నారు. మిగతా వారు మాత్రం ఉన్నామంటే ఉన్నాం అన్నట్టుగా ఉన్నారు. అయితే ఉన్నవారితో రాజకీయం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. కానీ ఉన్నవారు చాలా భయపడిపోతున్నారు. ముఖ్యంగా కూటమి వరుసగా కేసులు పెడుతుండడంతో బయటకు వచ్చి ధైర్యంగా ప్రకటనలు చేసేందుకు కూడా జంకుతున్నారు. ఈ తరుణంలోనే చాలామంది మాజీ మంత్రులు సైతం సమావేశానికి హాజరు కాలేదు.
Also Read: Thalliki Vandanam Scheme: తల్లికి వందనం’ రాలేదా?.. అయితే ఇలా చేయండి!
జాడ లేని అనిల్ కుమార్ యాదవ్
మొన్న ఆ మధ్యన అనిల్ కుమార్ యాదవ్ ( Anil Kumar Yadav)నెల్లూరు జిల్లాకు వచ్చి మీడియా ముందు మాట్లాడారు. ఆయన ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ధర్మాన ప్రసాదరావు సైతం పూర్తిగా ఈ సమావేశంలో కనిపించలేదు. ఇటువంటి చాలామంది యాక్టివ్ నేతలు సమావేశానికి హాజరు కాకపోవడం చర్చకు దారితీసింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న నేతల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయలేకపోతున్నారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించలేకపోతున్నారు. ఈ ప్రభావం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పడుతోంది. కష్టపడి పని చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. మొత్తానికి అయితే వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిరాశ జనకంగా ముగిసిందని చెప్పవచ్చు.
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో @ysjagan గారి అధ్యక్షతన పార్టీ విస్తృతస్ధాయి సమావేశం.#YSJagan#AndhraPradesh pic.twitter.com/5hIjLDdADq
— YSR Congress Party (@YSRCParty) June 25, 2025