Homeఆంధ్రప్రదేశ్‌SC Classification In AP: ఏపీలో ఎస్సీ వర్గీకరణ.. ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ.. 59...

SC Classification In AP: ఏపీలో ఎస్సీ వర్గీకరణ.. ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ.. 59 ఉప కులాలు టర్న్!

SC Classification In AP: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి వెన్నుదన్నుగా చాలా వర్గాలు నిలుస్తూ వచ్చాయి. ముఖ్యంగా ఎస్సీ, ముస్లిం మైనారిటీ వర్గాలు అండగా నిలిచేవి. ఆపై రెడ్డి సామాజిక వర్గం బలంగా నిలవడంతోనే ఇన్ని రోజులు ఆ పార్టీ తట్టుకొని నిలబడుతూ వచ్చింది. అయితే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయారు. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారు. అయితే ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో బలమైన ఉనికి చాటుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో.. సగానికి పైగా రిజర్వుడు నియోజకవర్గం నుంచి గెలిచిన వారే. తద్వారా ఎస్సీ సామాజిక వర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ఆదరణ చెక్కుచెదరలేదని అర్థమైంది. అయితే ఇకనుంచి ఆ పరిస్థితి ఉంటుందా అంటే అనుమానమే అంటున్నారు విశ్లేషకులు. ఎస్సీ వర్గీకరణ జరగనుండడంతో.. చాలా ఉప కులాలకు లాభం జరగనుంది. అదే జరిగితే మెజారిటీ ఎస్సీలు టిడిపి కూటమి వైపు రావడం ఖాయం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గండిపడడం ఖాయమని తెలుస్తోంది.

Also Read: ఏపీలో ఎస్సీ వర్గీకరణకు సై.. మూడు గ్రూపులుగా 59 కులాలు!

* అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి..
ఎస్సీల్లో( schedule casts) మాలలు, మాదిగలు ప్రముఖ పాత్ర పోషిస్తూ వస్తున్నారు. జనాభాపరంగా ఈ రెండు సామాజిక వర్గాలు అధికం. కానీ ఎస్సీల్లో 59 ఉపకులాలు ఉన్నాయన్న విషయం ఎవరికీ తెలియదు. ఆది నుంచి ఎస్సీలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. తెలుగుదేశం ప్రభంజనంలో సైతం ఎస్సీలు ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. అయితే 1999లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ విషయంలో ఒక వ్యూహం రూపొందించారు. అప్పటికే మాల సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం. కానీ తెలంగాణలో మాదిగలు అధికం. వారిని రాజకీయంగా ప్రోత్సహించాలని భావించారు చంద్రబాబు. అదే సమయంలో మంద కృష్ణ మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేశారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలోనే ఎస్సీ వర్గీకరణకు జై కొట్టారు చంద్రబాబు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టారు. దీంతో ఎస్సీల్లో స్పష్టమైన చీలిక కనిపించింది. తెలంగాణలో మాదిగలు టిడిపి వైపు వచ్చారు. అటు తరువాత రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రద్దయింది. దశాబ్దాలుగా న్యాయపోరాటం జరిగింది. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు.

* వైసీపీ వైపు మొగ్గు..
అయితే ఏపీలో కాంగ్రెస్ ( Congress Party) కుదేలయింది. ఆ స్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దీంతో ఎస్సీలు ఎక్కువగా ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు. అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పుణ్యమా అని.. చాలా ఉప కులాలు టిడిపి కూటమి వైపు వచ్చే అవకాశం ఉంది. త్వరలో డీఎస్సీ నియామక ప్రక్రియ జరగనుంది. అందులో కూడా ఎస్సీ వర్గీకరణను అనుసరించి రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. అందులో 59 ఉప కులాలు సమానంగా లబ్ధి పొందనున్నాయి. అదే జరిగితే దశాబ్దాలుగా తమకు జరిగిన అన్యాయాన్ని వారు గుర్తించే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని గుర్తించుకునే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఎస్సీ వర్గీకరణ అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.

* బలాబలాలు తారుమారు
ఏపీలో మాలల( Mala community) సంఖ్య అధికం. ఆ సామాజిక వర్గ జనాభా కూడా అధికం. వారంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువగా ఉన్నారు. కానీ అదే సమయంలో 59 ఉపకులాల సంఖ్య కూడా అధికమే. రాష్ట్రంలో పార్టీల గెలుపోవటములను వారు శాసించగలరు. అందుకే చంద్రబాబు ఎస్సీల్లో చీలిక తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని భావించారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన మరుక్షణం నుంచి పావులు కదపడం ప్రారంభించారు. వడివడిగా అడుగులు వేసి ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు. అయితే ఎస్సీ వర్గీకరణతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

 

Also Read: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రెండేళ్ల పెంపు!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular