SBI salary account: స్టేట్ బ్యాంకు( State Bank) తన ఖాతాదారులకు అద్భుతమైన ఒక అవకాశం కల్పించింది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దీనిని వర్తింపజేసింది.. ఈ బీమా పరిహారం కింద ఓ కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయలు రావడంతో హార్ట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అంతటా ఇదే చర్చ నడుస్తోంది. మొన్న ఆ మధ్యన స్టేట్ బ్యాంకు తో ప్రభుత్వం ఒక బీమా పథకం విషయంలో ఒప్పందం చేసుకుంది. స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ పథకం కింద ప్రమాద బీమా ను ప్రవేశపెట్టింది. ఎక్సైజ్ శాఖకు చెందిన హెడ్ కానిస్టేబుల్ పిచ్చేశ్వరరావు జూలై 1న ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కుటుంబానికి కోటి రూపాయల బీమా పరిహారాన్ని తాజాగా అందించారు. ఈ పథకం ప్రారంభించిన తర్వాత విధి నిర్వహణలో మరణించిన పిచ్చేశ్వరరావుకు బీమా పరిహారం అందడం మొదటిసారి కావడంతో ఉద్యోగుల్లో ఈ బీమా పథకం పై చర్చ నడుస్తోంది.
ఎస్బిఐ తో ఒప్పందం
కొద్ది నెలల కిందట ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఎస్బిఐ తో ఒప్పందం చేసుకుంది. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు ఇది వర్తింపజేయనుంది. ఉద్యోగి జీతానికి అనుగుణంగా వర్తింప చేసింది. అయితే ప్రత్యేక నగదు అనేది ఈ బీమాకు లేదు. ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించనవసరం లేదు. ప్రమాదవశాత్తు మరణించినప్పుడు వారి కుటుంబాలకు లక్షల్లో, కొన్ని సందర్భాల్లో కోటి రూపాయల వరకు బీమా పరిహారం అంది అవకాశం ఉంది. ఇప్పుడు అదే మాదిరిగా హెడ్ కానిస్టేబుల్ పిచ్చేస్వరరావు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం వచ్చింది. సీఎం చంద్రబాబు ఆ కుటుంబానికి చెక్కు అందజేశారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఈ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మృతుడి కుటుంబానికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు.
* ఎస్బిఐ జీతాల ఖాతా ఉన్న ఉద్యోగులకు ఈ ప్రమాద బీమా వర్తిస్తుంది. దీనికి ఉద్యోగి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన పని లేదు.
* ఏదైనా ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు.. ఉద్యోగి జీతాన్ని, బ్యాంక్ అకౌంట్ రకాన్ని అనుసరించి బీమా కవరేజీ ఉంటుంది.
* ఏపీ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి. అయితే దీనికి జీతం నుంచి కొంత మొత్తం కొత్త అవుతుంది. అదనపు కవరేజీ లభిస్తుంది.
* ప్రతి ఉద్యోగి తమ జీతాల ఖాతాను ఎస్బిఐ లోని SG SP ప్యాకేజీ లోకి మార్చుకుంటే ప్రయోజనం చేకూరుతుంది.