Sakshi TV Latest News: సాక్షి టీవీకి ( Sakshi TV)భారీ ఊరట దక్కింది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులకు సంబంధించి సాక్షి యాజమాన్యంపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కండిషనల్ బెయిల్ లభించింది. మరోవైపు సాక్షి యాజమాన్యం హైకోర్టు తలుపు తట్టింది. ఈరోజు ఆ కేసు విచారణకు వచ్చింది. ఇరు వర్గాల వాదనలను విన్న ఏపీ హైకోర్టు.. సాక్షి టీవీ పై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సాక్షి యాజమాన్యానికి ఉపశమనం దక్కినట్లు అయింది. కొద్ది రోజుల కిందట సాక్షి టీవీలో అమరావతి మహిళా రైతులపై జర్నలిస్ట్ కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదని.. అది వేశ్యల రాజధాని అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు రిమాండ్ లో ఉన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ లభించింది. ఇప్పుడు సాక్షి యాజమాన్యానికి సైతం హైకోర్టులో ఊరట దక్కింది.
జాగ్రత్త పడిన యాజమాన్యం..
ఇటీవల జరిగిన పరిణామాలతో సాక్షి టీవీ కూడా జాగ్రత్త పడింది. టీవీ డిబేట్లకు( TV debates) వచ్చేవారి అభిప్రాయంతో తమకు సంబంధం లేదని ఎక్స్ప్లెయిమేటర్ పేరిట ముందస్తు వివరణ ఇచ్చుకుంది. అమరావతి పై జరిగిన డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై నిరసనలు వ్యక్తమయ్యాయి. సాక్షి టీవీ క్రెడిబిలిటీ పై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇది నష్టం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ముందస్తు వివరణ వేసుకోవాల్సి వచ్చింది సాక్షి మీడియాకు. తెలుగు న్యూస్ ఛానల్ లో చరిత్రలోనే ఇలా ఎక్స్ క్లైమేటర్ ముందుగానే వేయడం అనేది ఎప్పుడూ లేదని మీడియా వర్గాలు చెబుతున్నాయి. అయితే సాక్షి మీడియాపై న్యాయపరంగా వెళ్తారని తెలిసి ఈ చర్యకు పూనుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.
Also Read: Bithiri Sathi: ఆ ప్రముఖ ఛానల్ కు కూడా దూరమైన బిత్తిరి సత్తి.. వాళ్లే పంపించేశారా?
ఆది నుంచి అదే వాదన..
అయితే టీవీ డిబేట్లకు వచ్చే వారితో సాక్షి మీడియాకు ఏంటి సంబంధం అని ఆది నుంచి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తూ వచ్చాయి. అయితే కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు తర్వాత ఆయనకు బెయిల్ నిరాకరించింది కోర్ట్. అయితే దానిని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుకు వెళ్లాల్సి ఉంది. కానీ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏపీ హైకోర్టులో సాక్షి యాజమాన్యం పిటిషన్ వేసింది. తమపై తదుపరి చర్యలు లేకుండా స్టే ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం స్టే విధించింది. దీంతో సాక్షి యాజమాన్యానికి భారీ ఊరట దక్కినట్లు అయింది.
బ్రేకింగ్
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
KSR లైవ్ షోకు సంబంధించి సాక్షి టీవీపై నమోదైన కేసులో ఏపీ హైకోర్టు స్టే
సాక్షి టీవీపై తదుపరి చర్యలను నిలిపేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు pic.twitter.com/MHaXOtvAI4
— Rahul (@2024YCP) June 20, 2025