Homeక్రైమ్‌Wife Cheating Viral Video: తల్లి నగలమ్మి భార్యను అధికారిని చేస్తే.. ఆమె వేరొకరితో దొరికింది..వైరల్...

Wife Cheating Viral Video: తల్లి నగలమ్మి భార్యను అధికారిని చేస్తే.. ఆమె వేరొకరితో దొరికింది..వైరల్ వీడియో

Wife Cheating Viral Video: అతడికి చదవంటే ఇష్టం. కాకపోతే కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఒక కంపెనీలో పని చేస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని పరవాలేదనే స్థాయిలోనే సాధించాడు. కొంతకాలం క్రితం అతనికి వివాహమైంది. అతని భార్య అప్పటికే ఇంటర్ దాకా చదువుకుంది.

చదువు విలువ తెలిసినాడు కాబట్టి తన భార్యను డిగ్రీ దాకా చదివించాడు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ తన తల్లి నగలు అమ్మేసి ఆమెను చదివించాడు. భర్త నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆమె కూడా బాగానే చదువుకుంది. చివరికి ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడింది. అయితే భర్త తన కోసం చేసిన త్యాగాన్ని.. తనకోసం పాడిన కష్టాన్ని మర్చిపోయింది ఆ ఇల్లాలు.. సభ్య సమాజం తలదించుకునే పని చేసింది. దీంతో ఆమె వ్యవహారం ఒక్కసారిగా బయటపడింది. ప్రస్తుతం ఈ విషయం అక్కడి మాధ్యమాలలో సందడి చేస్తోంది.

ఇంతకీ ఏం జరిగిందంటే..

బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో అగ్నిమాపక దళంలో ఓ మహిళ కానిస్టేబుల్ గా పని చేస్తోంది. ఆమెను ఉన్నత చదువులు చదివించడానికి భర్త తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. చివరికి తన తల్లి నగలు అమ్మి మరీ ఆమెను చదివించాడు. ఆమె కూడా భర్త నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా చదువుకుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. హాయిగా సాగిపోతున్న వారి సంసారంలో అనుకోకుండా ఒక కుదుపు ఏర్పడింది. తనతోపాటు అగ్నిమాపక దళంలో పనిచేస్తున్న వ్యక్తితో సభ్య సమాజం తలదించుకునే బంధానికి ఆ మహిళ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే తన భార్య ప్రవర్తనలో మార్పును భర్త గమనించాడు. నిత్య ఫోన్లో మాట్లాడడం.. ఫోన్ అదేపనిగా బిజీగా రావడంతో అనుమానం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఆమె వ్యవహార శైలిపై నిఘా పెట్టాడు. దీంతో అతని ఊహించలేని నిజాలు తెలిసాయి. దీంతో అతని గుండె పగిలింది. ఎలాగైనా తన భార్య చేస్తున్న తప్పుడు పనిని బహిర్గతం చేయాలని అతడు అనుకున్నాడు. ఈలోగా ఆ మహిళ భర్తను వదిలేసి దూరంగా ఉండడం మొదలుపెట్టింది. దీంతో తన భార్య వ్యవహార శైలిని సభ్య సమాజం ముందు బహిర్గతం చేయాలని భావించిన అతడు.. సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టాడు.

Also Read:  Karnataka: భర్తను 5 లక్షలకు అమ్మేసిన భార్య.. ఎందుకు? ఎవరికో తెలుసా? షాకింగ్ కారణం 

ఎప్పుడైతే భర్తకు దూరంగా ఉన్నదో.. అగ్నిమాపక దళంలో పనిచేసే ఆ వ్యక్తి ఆమె ఇంటికి తరచూ రావడం మొదలుపెట్టాడు. ఇక ఇటీవల ఈ విషయం ఆ మహిళ భర్తకు తెలిసింది. దీంతో ఎలాగైనా వారిద్దరిని పట్టుకోవాలని భావించాడు. ఇందులో భాగంగా వారిద్దరు కలిసి ఉన్నారని సమాచారం తెలుసుకున్న అతడు.. వెంటనే గదికి వెళ్ళాడు.. భర్తను చూసిన ఆమె యూనిఫామ్ వేసుకుంది. తనతో పాటు ఉన్న వ్యక్తిని మంచం కింద దాచింది. అయితే ఈ వ్యవహారం మొత్తాన్ని అతడు వీడియో తీశాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు వారిద్దరిపై కేసులు నమోదు చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఇద్దరిని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version