TTD Laddu Issue  : సుప్రీం సిట్ ను మేనేజ్ చేసే పనిలో చంద్రబాబు.. సాక్షి సంచలనం

పదేపదే అబద్దాలను చెప్పిన వెగటు పుడుతుంది. ఈ క్రమంలో నిజాలు చెప్పినా ఎవరూ నమ్మరు. ఇప్పుడు ఏపీలో వైసిపి అనుకూల మీడియా ది అదే పరిస్థితి. చంద్రబాబు విషయంలో ఈ స్థాయిలో ఆ మీడియా దుష్ప్రచారం చేస్తుందో తెలియంది కాదు. ఈ క్రమంలో చంద్రబాబుకు మంచి జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సుప్రీం కోర్టు సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. అదే తరహాలో ప్రయత్నించింది వైసీపీ అనుకూల మీడియా.

Written By: Dharma, Updated On : October 7, 2024 12:22 pm

TTD Laddu Issue 

Follow us on

TTD Laddu Issue  : టీటీడీ లడ్డు వివాదం పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తిరుమలలో కల్తీ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతువు కలిపారు అని సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. వైసీపీని కార్నర్ చేసి విమర్శలు చేశారు. అప్పటినుంచి రచ్చ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ అత్యున్నత అధికారుల బృందంతో సిట్ ను ఏర్పాటు చేసింది. ఆ బృందం విచారణను సైతం ప్రారంభించింది. తొలివిడతగా విచారణను పూర్తి చేసి.. అందుకు సంబంధించి నివేదికను సైతం డీజీపీకి అందించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ నిలిపివేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ అధ్యక్షుడు వై వి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో బిజెపి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సైతం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రానికి సీఎంగా ఉంటూ.. పూర్తిస్థాయిలో ఆధారాలు లేకుండా.. సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఆరోపణలు ఎలా చేస్తారు అని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఎటువంటి అభియోగాలు మోపలేదు. కేవలం సొలిసిటర్ జనరల్ అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాలని.. వారి సలహాను అడిగింది. కోట్లాదిమంది మనోభావాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఈ అంశంలో భాగస్వామ్యం చేసింది సుప్రీంకోర్టు. కానీ అదే పనిగా వైసిపి సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని ఆరోపణలు చేసింది. అయితే తదుపరి విచారణలో ఎక్కడ చంద్రబాబు సర్కార్ వైఖరిని సుప్రీం ప్రశ్నించలేదు. కేవలం సొలిసిటర్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ చాలదని.. కేంద్ర దర్యాప్తు సంస్థ అవసరమని చెప్పుకొచ్చారు. అందుకే మద్యేమార్గంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశించింది.

* ఒకవైపు సంతోషం.. మరోవైపు అవమానం
అయితే సుప్రీంకోర్టు ప్రత్యేక సిట్ ఏర్పాటుపై స్వాగతించారు సీఎం చంద్రబాబు. సత్యమేవ జయతే.. నమో వెంకటేశాయ అని వ్యాఖ్యానించారు. అటు జగన్ సైతం తమ మాట చెల్లుబాటు అయిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సి ట్ తో పారదర్శక విచారణ జరగదని తాము అభిప్రాయపడ్డామని.. ఇప్పుడు సుప్రీం కోర్టు సైతం అదే చెప్పుకొచ్చిందని గుర్తు చేశారు. అయితే ప్రత్యేక సిట్ ఏర్పాటులో భాగంగా ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ను తప్పు పట్టలేదు సుప్రీంకోర్టు. కేవలం అత్యున్నత దర్యాప్తు సంస్థ, తటస్థ దర్యాప్తు సంస్థ అవసరం అని సొలిసిటర్ జనరల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతోనే సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

* చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారట
అయితే ఇప్పుడు వైసీపీ కొత్త ప్రచారానికి తెరతీసింది. సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన ప్రత్యేక సిట్ ను కూడా.. చంద్రబాబు మేనేజ్ చేయబోతున్నారని సాక్షిలో ప్రత్యేక కథనం వచ్చింది. గత రెండు రోజులుగా చంద్రబాబు తిరుమలలో పర్యటించిన సంగతి తెలిసిందే. శ్రీవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తిరుమలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు టీటీడీ అధికారులతో సమీక్షలు కూడా జరిపారు. ఏపీలో లడ్డు వివాదం నేపథ్యంలో మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయితే ఈ క్రమంలో సాక్షి ఒక కథనం ప్రచురించింది. అన్నీ నేను చూసుకుంటాను. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక సిట్ ఎదుట.. వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు ఉన్నది ఈ కథనం సారాంశం. మొన్న సుప్రీంకోర్టు తప్పు పట్టిందని వారే వాదించారు. ఇప్పుడు అదే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ను చంద్రబాబు ప్రభావితం చేస్తారని ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ విషయంలో వైసీపీలో సైతం ఒక రకమైన గందరగోళంలో ఉంది. అయితే సాక్షి రాసిన కథనం తప్పు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతం నుంచి సాక్షి ఇదే అభిప్రాయంతో ముందుకెళుతుందని.. సుప్రీంకోర్టు ఆగ్రహించిందని వారే రాశారు.. ఇప్పుడు అదే సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సిట్ ను చంద్రబాబు నీరుగారిచే ప్రయత్నం చేస్తున్నారని వారే రాసుకొచ్చారు. దీంతో ఇది నమ్మశక్యంగా లేదు. సామాన్యులు సైతం తేలిగ్గా తీసుకుంటున్నారు.