Late marriage problems: ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులోనే జరగాలని మన పెద్దలు చెబుతుంటారు. పూర్వకాలంలో అయితే అందరికి చిన్న వయస్సులోని పెళ్లిళ్లు జరిగేవి. కానీ ఇప్పుడు జనరేషన్‌లో అయితే ఆలస్యంగానే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. సాధారణంగా అబ్బాయిలకు 21, అమ్మాయిలకు 18 ఏళ్లు వస్తే పెళ్లి చేసుకోవచ్చని చట్టం చెబుతోంది. పెళ్లి వయస్సు ఉన్నప్పుడే చేసుకోవాలని అంటుంటారు. వయస్సు దాటాక పెళ్లి చేసుకున్న లేకపోయిన ఒకటే అని అంటుంటారు. మరి పెళ్లి వయస్సు వచ్చినప్పుడే చేసుకోవాలా? పెళ్లికి వయస్సుకి సంబంధం ఉందా? అని ఆలోచిస్తున్నారు. అయితే ఈరోజుల్లో చాలామంది ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల చాలా సమస్యలు తప్పవని వైద్య నిపుణులు అంటున్నారు. మరి పెళ్లికి వయస్సుకి సంబంధం ఉందా? లేదా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పెళ్లికి, వయస్సుకి సంబంధం ఉందని కొందరు అంటున్నారు. వయస్సు ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయాలని, తర్వాత చేసుకున్న ప్రయోజనం లేదంటున్నారు. ఎందుకంటే వయస్సులో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే ఆలస్యంగా చేసుకుంటే పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మహిళలకు 30 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ సమయంలో అండం రిలీజ్ కావడం కూడా కాస్త కష్టమే. అదే వయస్సులో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పెళ్లి చేసుకోకుండా ఉండటం వల్ల మహిళలకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అదే పెళ్లి చేసుకుంటే కొన్ని రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులో జరిగితేనే అందమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
కొందరు పెళ్లికి, వయస్సుకి సంబంధం లేదని అంటున్నారు. ఎందుకంటే ఈరోజుల్లో చాలామంది ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. వీరికి పిల్లలు పుట్టడం లేదా? సంతోషంగా జీవించడం లేదా? అని అంటున్నారు. పెళ్లి అనేది వయస్సుతో అసలు సంబంధం లేదు. మెంటల్‌గా చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు చేసుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. పెళ్లి అనేవి వ్యక్తిగత అభిప్రాయం. అర్థం చేసుకునే వ్యక్తి దొరికినప్పుడు ఏ వయస్సులో అయిన చేసుకోవచ్చని అంటున్నారు. కొందరు అయితే పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకుంటారు. కానీ ప్రతి వ్యక్తికి తోడు అనేది అవసరం. ఫీలింగ్స్, ఎమోషన్స్ షేర్ చేసుకోవడానికి మనకంటూ ఒక పర్సన్ ఉండాలి. అప్పుడే జీవితానికి అర్థం ఉంటుంది. ఈ రోజుల్లో తొందరగా పెళ్లి చేసుకుని విడిపోతున్నారు. అలా తొందర పడటం కంటే ఆలస్యంగా చేసుకున్న జీవితాంతం నచ్చిన వ్యక్తితో సంతోషంగా ఉండటం మేలని కొందరు అంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా మెంటల్‌గా పెళ్లికి ఎప్పుడు రెడీ అనిపిస్తే అప్పుడు చేసుకోవాలని కొందరు అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు.