Sakshi Debate Disclaimer: సాధారణంగా మీడియాలో( media) వచ్చిన కథనాలపై యాజమాన్యాలు చాలా జాగ్రత్తగా తీసుకుంటాయి. వారికి ఎక్కడ నుంచి సమాచారం వచ్చింది? ఎలా తీసుకున్నాం? అన్నదానిపై ముందస్తు వివరణ ఇస్తుంటారు. తమ పత్రికలు, టీవీల్లో వచ్చిన ప్రకటనలకు తాము బాధ్యులు కామని చెబుతుంటారు. అందుకు తాము బాధ్యత వహించమని కూడా స్పష్టం చేస్తారు. తాజాగా సాక్షి ఛానల్ లో కూడా ఇటువంటి ముందస్తు వివరణ వచ్చింది. ఆ మీడియా ప్రత్యేకంగా డిస్లైమర్ వేసింది. సాక్షిలో డిబేట్లకు తాము బాధ్యత వహించమని.. ఈ విషయంలో తమ యాజమాన్యానికి ఎటువంటి బాధ్యత లేదని ముందుగానే ప్రకటన జారీ చేయడం విశేషం.
సాక్షి స్క్రీన్ పై… సరికొత్తగా… డిస్క్లైమర్…!#Sakshi #Disclaimer
డిబేట్స్ కి వచ్చే గెస్టులకి వార్నింగ్ ఇచ్చినట్లా… లేక… మీరు భయపడినట్లా… #JustAsking pic.twitter.com/ayjqYKf0sZ
— Kaza RajKumar (@KazaRajKumar) June 17, 2025
ఇటీవల వివాదాస్పదం..
సాక్షి టీవీలో( Sakshi TV) ఇటీవల వచ్చిన ఓ డిబేట్ వివాదాస్పదంగా మారింది. సీనియర్ జర్నలిస్టు కుమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే ఓ డిబేట్లో కృష్ణంరాజు అనే మరో సీనియర్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. అమరావతిని దేవతల రాజధాని అనడం తప్పు అని.. అది వేశ్యల రాజధాని అని పేర్కొనడం దుమారం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా కొమ్మినేని తో పాటు కృష్ణంరాజు పై కేసులు నమోదయ్యాయి. కొమ్మినేని నేరుగా కామెంట్ చేయకపోవడంతో ఆయనకు కండిషనల్ బెయిల్ వచ్చింది. కృష్ణంరాజు మాత్రం రిమాండ్ లో కొనసాగుతున్నారు.
Also Read: Amaravati Women: అమరావతి మహిళల ఆందోళన.. సాక్షి గేటుకు తాళాలు
చెడ్డపేరు రావడంతోనే..
సాక్షిలో వచ్చిన ఈ డిబేట్ ఆ యాజమాన్యంతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ( YSR Congress )చెడ్డ పేరు తీసుకొచ్చింది. కృష్ణంరాజు వ్యాఖ్యలు వ్యక్తిగతమని.. దానికి యాజమాన్యంతో సంబంధం లేదని సాక్షి వివరణ ఇచ్చింది. అయినా సరే సదరు సాక్షి మీడియాతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో జరిగిన డ్యామేజ్ పై దృష్టి పెట్టింది సాక్షి యాజమాన్యం. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ చానల్లో జరిగే చర్చా కార్యక్రమాల ముంగిట.. డిస్క్లైమర్ వేస్తోంది.
Also Read: Audit Bureau of Circulation : అనుకూల జీవో ఇచ్చినా సాక్షి లేవలేదు.. కోర్టుకు వెళ్లినా ఈనాడు గెలవలేదు.
తెలుగు ఛానల్స్ చరిత్రలోనే..
టీవీ డిబేట్లకు( TV debates) హాజరయ్యే అతిధుల వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగతమని.. దాంతో సాక్షి యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటుంది. ఆ వ్యాఖ్యలను పాము సమర్ధించడం కానీ.. ప్రచారం చేయడం కానీ చేయమని.. ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే తాము అందుకు బాధ్యులు కామని.. వాటిని తీవ్రంగా ఖండిస్తామని సాక్షి యాజమాన్యం స్పష్టం చేసింది. తమ ఛానల్ కు విలువలు, నిబంధనలు ఉన్నాయని.. వాటికి కట్టుబడి ఉంటామని.. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తమకు లేదని పేర్కొంది సాక్షి. అయితే తెలుగు న్యూస్ చానల్స్ చరిత్రలోనే.. డిబేట్లకు ముందు ఇలా డిస్క్లైమెర్ వేయడం ఇదే తొలిసారి అని జర్నలిస్ట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే సాక్షి డిబేట్లకు ఎంపిక చేసిన జర్నలిస్టులు, విశ్లేషకులు వెళ్తుంటారు. ఇకముందు వారు ఏది పడితే అది మాట్లాడితే కుదిరే పని కాదు. అందుకు సాక్షి బాధ్యత వహించదు. చూడాలి ఈసారి డిబేట్లకు హాజరయ్యే వారి పరిస్థితి.