Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు, జైలు.. సెంటిమెంట్ కు ‘సజ్జల’ యాంటిమెంట్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. కేసుల విషయం ప్రస్తావిస్తున్నారు. తనపై తప్పుడు కేసులు మోపారని.. అవినీతిని అంటగట్టే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేస్తున్నారు.

Written By: Dharma, Updated On : February 22, 2024 11:07 am
Follow us on

Sajjala Ramakrishna Reddy: జగన్ విషయంలో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది. సానుభూతి అధికారానికి దగ్గర చేసింది. రాజశేఖర్ రెడ్డి అకాల మరణం, కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టి జైల్లో వేయడం… జగన్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. బలమైన నాయకుడిగా బీజం వేసింది ముమ్మాటికి సెంటిమెంటే. అయితేఇప్పుడు చంద్రబాబుకు అదే సెంటిమెంట్ వర్తించదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఇది జరిగి రెండు నెలలు దాటుతుండడంతో ఆ సెంటిమెంట్ పనిచేయదని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. కేసుల విషయం ప్రస్తావిస్తున్నారు. తనపై తప్పుడు కేసులు మోపారని.. అవినీతిని అంటగట్టే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేస్తున్నారు.ఇది ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి.మరోవైపు చంద్రబాబు అరెస్టు తర్వాతే రాజకీయ పరిస్థితులు మారాయని.. టిడిపికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ తరుణంలో వైసీపీ నేతల స్పందన విరుద్ధంగా ఉంది. చంద్రబాబు పట్ల ప్రజలకు సెంటిమెంట్ లేదని వారు తేల్చి చెప్పడం విశేషం.

తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైలుకెళ్లి వచ్చిన ప్రజలు పట్టించుకోలేదని తేల్చి చెప్పారు. రోగాలు ఉన్నాయని జైలు నుంచి బెయిల్ తెచ్చుకొని చంద్రబాబు కుర్రాడిలా తిరుగుతున్నారని ఆయన ఆక్రోషం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు అరెస్ట్ టాపిక్ ఎక్కడా చర్చ జరగడం లేదని కూడా సజ్జల తేల్చేశారు. అంతటితో ఆగని సజ్జల అన్ని వర్గాల సంక్షేమానికి తాము పాటుపడ్డామని.. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ అధికారంలోకి వచ్చి వాటన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పడం విశేషం. మొత్తానికైతే ఒక్కజగన్ విషయంలోనే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని.. చంద్రబాబు విషయంలో ప్రజలు అలా ఆలోచించారని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సొంత పార్టీ శ్రేణులని భోజనాలకు పిలిచి మరి సజ్జల కొన్ని రకాల వేదాలు వల్లిస్తూ ఉండడం మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. జగన్ కు అత్యంత ఆప్తులు దూరమవుతున్న వేళ.. సజ్జల ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండడం అతిగా అనిపిస్తోంది.