RK Kotha Paluku : చంద్రబాబు భజన చేయడంలో.. శృతి కీర్తనలు పాడటంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండూ రెండే. మొన్నటి ఎన్నికల్లో ఏకపక్షంగా ఎలాంటి పసుపు రాతలు రాశాయో చదివాం కదా. కాకపోతే ఎన్నికలు ముగిసిన తర్వాత ఈనాడు కాస్త ఏకపక్షంగా రాయడం తగ్గించినప్పటికీ.. ఆంధ్రజ్యోతి మాత్రం అంతకుమించి అనే రెంజ్ లో చంద్రబాబు గురించి రాస్తోంది. చంద్రబాబు నాయుడు ఆదివారం నాటికి 75వ ఏట అడుగుపెడుతున్నారు. ఆంధ్రజ్యోతి ఓనర్ వేమూరి రాధాకృష్ణ తన పేపర్లో ప్రతి ఆదివారం రాసే కొత్త పలుకులో శృతి కీర్తనలను దంచి కొట్టాడు.. వాస్తవానికి ఆంధ్రజ్యోతిలో సంపాదకీయాలు బాగుంటాయని బయట టాక్. ఏ మాటకు ఆ మాటే.. ఇలాంటి సంపాదకీయాలు రాయాలంటే.. లేదా ప్రచురించాలంటే మేనేజ్మెంట్ కు దమ్ము ఉండాలి. ఆ విషయంలో రాధాకృష్ణకు తిరుగులేదు. కాకపోతే చంద్రబాబు విషయానికి వచ్చేసరికి ఆయన ఒక్కసారిగా లైన్ తప్పుతారు. భజన చేయడంలో పీక్స్ కు వెళ్లి లైన్ దాటిపోతారు. అది చంద్రబాబుకు నష్టమో, లాభమో అనే విషయాన్ని మర్చిపోయి.. ఏదేదో రాస్తుంటారు. తాజాగా రాసిన కొత్త పలుకులో రాధాకృష్ణ చంద్రబాబు గురించి ఏమంటాడు అంటే..” చంద్రబాబు నాయుడుకి పెద్దగా సెంటిమెంట్లు ఉండదు. ఎమోషన్లు ఉండవు. ప్రాక్టికల్ మనిషి. తను ఎవరినీ నమ్మడు. ఎవరినీ చేరదీయడు.. ఒక రకంగా తను రోబో. చంద్రబాబు భోజనం కూడా చేతులతో కలుపుకొని తినడు. స్పూన్ తోనే తింటాడు. ఆ తిండి కూడా పెదవులకు అంటకుండా చూసుకుంటాడు. ఇటీవల కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అందించిన ప్రసాదాన్ని కూడా మొత్తం తినలేదు. మొదటిసారి రెండు స్పూన్లు మాత్రమే తిన్నాడు. ఆ తర్వాత తన భార్య భువనేశ్వరికి ఇచ్చాడు. ఆ తర్వాత మరో ప్రసాదాన్ని అక్కడి అర్చకులు మరోసారి ఇస్తే.. దానిని భువనేశ్వరి కి ఇవ్వబోయాడు. దానిని ఆమె వారించింది. దీంతో అటు ఇటు చూసి పక్కన ఉన్న వారికి ఇచ్చేశాడు. సాధారణంగా మనం ఎవరైనా ఏదైనా ఇస్తే తినేస్తాం. కానీ చంద్రబాబు తూకం వేసుకొని మాత్రమే తింటారు” ఇదీ రాధాకృష్ణ రాసింది. నిజంగా రాధాకృష్ణ ఏం చెప్పాలనుకున్నాడో.. ఏం రాయాలనుకున్నాడో.. ఒక్క ముక్క అర్థమైతే అంత ఒట్టు. చూడబోతే తన కొత్త పలుకు ఎడిటోరియల్ ను ఏదో ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఒక పేరాకు మరో పేరాకు సంబంధం లేకుండా రాధాకృష్ణ రాసుకుపోయారు
Also Read : విజయసాయిరెడ్డి పై గొడ్డలి వేటు పెద్ద పని కాదు.. చంద్రబాబు రక్షణ కల్పించాలి!
ఇంగ్లీష్ రాదట
చంద్రబాబు చదువుకున్నది ప్రభుత్వ పాఠశాలల్లో.. ప్రభుత్వ కళాశాలల్లో.. ఆయన ఎస్వీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదువుకున్నారు. అందువల్లే ఆయన ఎకనామిక్ రిఫార్మ్స్ ను అత్యంత వేగంగా అమలుపెట్టాలని కోలుకుంటారు. ఒక పరిపాలకుడిగా ఇందులో తప్పులేదు. కాకపోతే ముఖ్యమంత్రిగా ఉండడం వేరు.. ముఖ్యమంత్రి పదవిలో ఉండి సీఈవోగా వ్యవహరించడం వేరు. ఈ రెండింటికి తేడా తెలియకపోవడం వల్లే చంద్రబాబు నాయుడు లోని రాజకీయ నాయకుడు ఇప్పటికి ఇంకా బయటికి రాలేకపోతున్నాడు. కాకపోతే ఈ విషయాన్ని చెప్పడంలో రాధాకృష్ణ తడపడ్డాడు. అంతేకాదు దీనికి కవర్ చేయడానికి షుగర్ కొటెడ్ టాబ్లెట్ లాగా ఏదో రాసుకుంటూ పోయాడు. ఇక చంద్రబాబుకు ఇంగ్లీష్ రాదని.. ఆయనకు భాష పరిజ్ఞానం అంతంత మాత్రమేనని రాధాకృష్ణ రాశాడు. ఆ లెక్కన రాధాకృష్ణ చదివింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కాదు.. ఆయనకేమీ ఇంగ్లీష్ గొప్పగా రాదు. అలాంటప్పుడు చంద్రబాబుకు ఇంగ్లీష్ రాదు అని చెప్పడంలో రాధాకృష్ణ ఉద్దేశం ఏమిటో.. పదేపదే చంద్రబాబు ఎవరినీ నమ్మడు అని రాయడం ఎందుకో ఆర్కేకే తెలియాలి.. దాదాపు పేజీలో ముప్పావు వంతు రాసిన ఈ ఎడిటోరియల్ లో రాధాకృష్ణ చెప్పాల్సింది చెప్పాడు. రాయాల్సింది రాశాడు. అంతిమంగా అర్థం కాక జుట్టు పీక్కుంటే దానికి రాధాకృష్ణ బాధ్యుడు కాదు.