Good Bad Ugly: ఈ ఏడాది సర్ప్రైజ్ హిట్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘డ్రాగన్'(Dragon). ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరో గా నటించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది. తెలుగు లో కూడా ఈ చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ పేరు తో విడుదలై ఇక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఓవరాల్ గా తెలుగు, తమిళ వెర్షన్స్ కి కలిపి ఈ చిత్రం 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం తమిళనాడు ప్రాంతం నుండి 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా రెండవ శనివారం రాబట్టిన వసూళ్లను రీసెంట్ గా విడుదలైన అజిత్(Thala Ajith) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie) చిత్రం రాబట్టలేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Also Read: కోట్ల రూపాయిలు సంపాదిస్తున్న ‘పుష్ప’ డూప్..స్టార్ హీరోలు కూడా పనికిరారు!
‘డ్రాగన్’ చిత్రానికి రెండవ శనివారం 2063 షోస్ నుండి 5 కోట్ల 34 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి 2237 షోస్ నుండి కేవలం 5 కోట్ల 8 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అదే విధంగా తలపతి విజయ్ నటించిన ‘గోట్’ చిత్రానికి రెండవ శనివారం తమిళనాడు నుండి 2802 షోస్ కి గాను 10 కోట్ల 76 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, యంగ్ హీరో శివ కార్తికేయన్ అమరం చిత్రానికి 2325 షోస్ కి గాను 8 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రీసెంట్ గా విడుదలైన అన్ని సూపర్ హిట్ సినిమాలకంటే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి కాస్త తక్కువ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అందుకు కారణం కూడా లేకపోలేదు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి శుక్రవారం రోజున సెలవు వచ్చింది. సెలవు దినం తర్వాత వచ్చిన శనివారం కావడంతో కాస్త కలెక్షన్స్ మీద ప్రభావం చూపించింది, లేకపోతే కచ్చితంగా రెండవ శనివారం రోజున ఈ చిత్రానికి 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చి ఉండేవని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా తమిళనాడు ప్రాంతంలో పది రోజులకు గాను ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి 128 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి దాదాపుగా 6 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు కర్ణాటక నుండి 13 కోట్ల రూపాయిలు, కేరళ నుండి మూడు కోట్ల 30 లక్షల రూపాయిలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి రెండు కోట్ల 20 లక్షలు, ఓవర్సీస్ నుండి 58 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.