RK Chandrababu Interview Reason: ఆర్థిక లోటులో ఉన్నామని చెబుతూనే కూటమి ప్రభుత్వ పెద్దలు భారీగా తమకు అనుకూల పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. టీవీ చానల్స్ కూడా భారీగానే యాడ్స్ ఇచ్చారు. సహజంగానే వైసిపి మౌత్ పీస్ లకు ప్రకటనలు రాలేదు. ఇప్పుడు ఏపీలో ఉప్పు నిప్పులాగా వ్యవహారం ఉంది కాబట్టి.. వైసిపి మౌత్ పీస్ లకు ప్రభుత్వం తరఫున ప్రకటనలు వచ్చే అవకాశం లేదు. ఇక కూటమి అనుకూల మీడియాలో గురువారం అనుకూల కథనాలు ప్రసారమయ్యాయి. ముఖ్యంగా కూటమి అధినేతగా.. ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చంద్రబాబునాయుడు పలు టీవీ చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో ఈటీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూకి సంబంధించి ప్రోమోలు విడుదల చేశాయి. ఈటీవీ నుంచి ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేయగా.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నుంచి వెంకటకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. వెంకటకృష్ణ ఒక రకంగా భయంతోనే చంద్రబాబు నాయుడిని ప్రశ్నలు అడిగారు.. వాటికి చంద్రబాబు సరైన తీరుగా సమాధానం చెప్పారు.. చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూకి సంబంధించిన కీలక అంశాలను ప్రోమోల రూపంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
View this post on Instagram
వాస్తవానికి టిడిపి అధినేతను అనేక సందర్భాలలో ఏబీఎన్ ఛానల్ ఎండి వేమూరి రాధాకృష్ణ అలియాస్ ఆర్కే ఇంటర్వ్యూ చేశారు. కానీ ఈసారి రాధాకృష్ణ కాకుండా వెంకటకృష్ణను పంపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పైగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాస్త ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నది. ఏబీఎన్ లోనే సూపర్ సిక్స్ పథకాల అమలుపై వ్యతిరేక కథనాలు ప్రసారమవుతున్నాయి. టిడిపి ఎమ్మెల్యేలపై కూడా ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా స్టోరీలను ప్రచురిస్తోంది.. మరోవైపు రాధాకృష్ణ ఇటీవల జిల్లాలో మీటింగ్లలో సిబ్బందికి ఆధారాలు ఉంటే ఎవరిపైనైనా సరే వ్యతిరేక కథనాలు రాయాలని పిలుపునిచ్చారు. సాక్షాత్తు ఎండి అలాంటి ఆదేశాలు ఇవ్వడంతో సిబ్బంది కూడా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఆధారాలు దొరికితే వ్యతిరేక కథనాలు రాయకుండా ఉండటం లేదు. మొత్తంగా ప్రభుత్వానికి రాధాకృష్ణ అనుకున్నంత సానుకూలంగా ఉండడం లేదు. ఒకరకంగా సాక్షి కంటే ఆంధ్రజ్యోతిలోనే కూటమి మీద వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. రాధాకృష్ణ ఇలా మారిపోవడానికి కారణాలేంటి? చంద్రబాబును సైతం ఇంటర్వ్యూ చేయకుండా వెంకటకృష్ణతో వారి పూర్తి చేయించడం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియక టిడిపి నేతలు జుట్టు పీక్కుంటున్నారు.. చంద్రబాబు నాయుడు రాధాకృష్ణకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడం లేదా? ఆయన కోరుకున్నట్టుగా నడుచుకోవడం లేదా? ఇతర మీడియా ప్రతినిధులకు చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారా? అది రాధాకృష్ణకు నచ్చడం లేదా? అందువల్లే అంటి ముట్టినట్టు ఉంటున్నారా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు లభిస్తుంది? వీటికి క్లారిటీ ఎవరిస్తారు? అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.
Also Read:ABN RK Sharmila: ఏబీఎన్ ఆర్కేతో షర్మిల.. జగన్ తో గొడవ.. ‘కేటీఆర్ ఎవరు’పై క్లారిటీ!