https://oktelugu.com/

CM Revanth Reddy: నన్నేం చేయలేరు.. ఎందుకంటే కేసీఆర్ లక్కీనంబర్ నా దగ్గరే ఉందన్న రేవంత్ రెడ్డి

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం తెలంగాణలో ఇప్పుడు కాక రేపుతోంది. హైకోర్టు అసెంబ్లీకి కీలక ఆదేశాల తర్వాత అధికా కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మరోవైపు స్పీకర్‌ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 13, 2024 / 02:55 PM IST

    CM Revanth Reddy(11)

    Follow us on

    CM Revanth Reddy: తెలంగాణలో పార్టీ మారిన పది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్‌ నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై ఇటీవలే ధర్మాసనం అసెంబ్లీ సెక్రెటరీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్‌ నిర్ణయమే కీలకంగా మారింది. ఈతరుణంలో అధికార కాంగ్రెస్, పార్టీ మారిన ఎమ్మెల్యేల మధ్య వార్‌ జరుగుతోంది. ఈ పరిస్థితిలో ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంతోపాటు పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి, ఉప ఎన్నికలు, తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఏ ఆర్డార్‌ వచ్చినా మంచిదే..
    పార్టీ ఫిర్యాంచిన ఎమ్మెల్యేపై ఏ ఆర్డర్‌ వచ్చినా కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఏ ఆర్డర్‌ వచ్చినా స్వాగతిస్తానని తెలిపారు. అనర్హత ప్రకటిస్తే ముందుగా సంతోషించేంది తానేని పేర్కొన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని కూలుస్తామన్నందుకే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరి మద్దతు తెలిపారన్నారు. నాడు పడగొడతామన్న బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఇప్పుడు ఫిరాయింపులపై పోరాడుతున్నారని తెలిపారు.

    నాదగ్గరే కేసీఆర్‌ లక్కీ నంబర్‌..
    ఇదిలా ఉంటే.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్కీ నంబర్‌ ఇప్పుడు తన వద్ద ఉందని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తను 66 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చమత్కరించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనా రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లు పాలించొద్దని బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు కోరుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. కేటీఆర్‌ బై ఎలక్షన్స్‌ పేరుతో మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని విమర్శించారు. బై ఎలక్షన్స్‌ వస్తాయనుకుంటే దేశంలో పార్టీ ఫిరాయింపులే ఉండేవి కావన్నారు. కాంగ్రెస్‌కు 65 మంది ఎమ్మెల్యేల బలం ఉందని తెలిపారు.

    ఒవైసీ పీఏసీ చైర్మన్‌ ఎలా అయ్యారు.
    ఇక తాజాగా పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీ నియామకం నేపథ్యంలో.. మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు పీఏసీ చైర్మన్‌ పదవి ఇవ్వకుండా ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీకి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరి స్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరికెపూడి గాధీకే పీఏసీ చైర్మన్‌గా అవకాశం దక్కిందని తెలిపారు. స్పీకర్‌ విచక్షణాధికారం మేరకే నియామకం అని నాడు అన్న మాటలు గుర్తులేవా అని ప్రశ్నించారు.

    ఆ పార్టీ లైన్‌లోనే కౌశిక్‌ వ్యాఖ్యలు..
    బతకడానికి వచ్చిన వారిపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ లైన్‌లోనే పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని సీఎం విమర్శించారు. బతకడానికి వచ్చిన వారి ఓట్లతోనే హైదరాబాద్‌లో ఆ పార్టీ గెలిచిందని గుర్తుంచుకోవాలన్నారు. ఏపీ వాసులను అవమానించేలా కౌశిక్‌ మాట్లాడిన మాటలపై కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ రావుకి చెప్పి మాట్లాడిస్తే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డింమాండ్‌ చేశారు.