Homeఆంధ్రప్రదేశ్‌Guntur honey trap incident: ఆ ఏజ్ ఏంది.. కింద గేజ్ ఏంది.. ఈ వయసులో...

Guntur honey trap incident: ఆ ఏజ్ ఏంది.. కింద గేజ్ ఏంది.. ఈ వయసులో అంకుల్ కు కన్నెపిల్ల మీద మనసు.. చివరికి ఏమైందంటే

Guntur honey trap incident: అతని వయసు 6 పదులు దాటి చాలా రోజులైంది. వాస్తవానికి ఆ వయసుకు వచ్చిన వారంతా అనారోగ్యం సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇప్పటి కాలంలో అయితే బీపీలు, షుగర్లు కామన్ అయిపోయాయి. అంతటి వయసున్న ఓ వ్యక్తి దారితప్పాడు. అంకుల్ అని పిలిపించుకునే వయసులో.. ఏదో కావాలనుకున్నాడు. చివరికి అడ్డంగా బుక్ అయ్యాడు.

నేటి కాలంలో మోసాలు చేసేవారు మాయమాటలు చెబుతున్నారు. తియ్యగా మాట్లాడుతూ ఉన్నది మొత్తం ఊడ్చేస్తున్నారు. ఇక ఈ దందా లోకి ఆడవాళ్లు కూడా చేరిపోయారు. తీయగా మాట్లాడుతూ.. మాయ మాటలు చెబుతూ కోట్లకు కోట్లు దండుకుంటున్నారు. ఇటువంటివారు పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్నప్పటికీ.. చాలామంది మారడం లేదు. పైగా మాయ మాటలు నమ్మి మోసపోతున్నారు.

గుంటూరు జిల్లాలో ఓ విశ్రాంత ఉద్యోగి వలపు వలలో చిక్కుకున్నాడు. ఫేస్ బుక్ లో అయిన పరిచయాన్ని వేరే విధంగా వాడుకుందామని అనుకున్నాడు. చివరికి అడ్డంగా బుక్ అయ్యాడు. ఏకంగా 1.09 కోట్లు మోసపోయాడు..

ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు అందమైన అమ్మాయిని అతడికి ఎరగా వేశారు. ఈ మోసం తెలియని అతడు ఆమె మాయమాటలకు లొంగిపోయాడు. ఆ మాయ లేడీ తనను తాను మౌనికగా పరిచయం చేసుకుంది. ప్రతిరోజు అతడికి వీడియో కాల్స్ చేసేది. చాటింగ్ కూడా చేసేది. చిన్న మొత్తాలతో భారీగా లాభాలు వస్తాయని.. పెట్టుబడులు పెట్టాలని అతడికి సూచించింది. ఆ అమ్మాయి వీడియో కాల్స్ చేయడం.. చాటింగ్ చేయడంతో ఆ విశ్రాంత ఉద్యోగి ఆమెకు దగ్గరయ్యాడు. తను జీవితకాలం సంపాదించిన డబ్బును మొత్తం ఆ అమ్మాయి చెప్పినట్టుగా వేరే వేరే ఖాతాలకు మళ్ళించాడు. మొదట్లో లాభాలు వచ్చాయని ఆ అమ్మాయి అతడికి చూపించింది. డబ్బులు డ్రా చేసుకోవాలని అతడు భావించగా.. ఆమె అనేక రకాల అడ్డంకులు సృష్టించింది. దీంతో మోసపోయానని భావించిన అతడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అతడు డబ్బులు పంపించిన ఖాతాల వివరాలను పరిశీలించిన పోలీసులు ముగ్గురిని గుర్తించారు. ఆ అడ్రస్లలో పరిశీలిస్తే వారు కనిపించలేదు. దీంతో ఈ సైబర్ కేసును పోలీసులు అత్యంత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఆన్లైన్ ట్రేడింగ్ కు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Today 28 July 2026 Horoscope

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Oktelugu Epaper