Homeఆంధ్రప్రదేశ్‌Rayalaseema Political Strategy: చంద్రబాబు గురి.. రాయలసీమపై భారీ స్కెచ్!

Rayalaseema Political Strategy: చంద్రబాబు గురి.. రాయలసీమపై భారీ స్కెచ్!

Rayalaseema Political Strategy: రాయలసీమపై( Rayalaseema ) చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారా? ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ప్రత్యర్థి కి అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారా? అందుకే తరచూ రాయలసీమలో పర్యటనలు చేస్తున్నారా? బనకచర్ల ప్రాజెక్టు అందులో భాగమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు సైతం రాయలసీమ బిడ్డ. ఆయనకి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లె. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మాదిరిగా సొంత జిల్లాలో తనకంటూ ఒక ముద్ర చాట లేకపోతున్నారు. నిజంగా అది చంద్రబాబుకు లోటు. రాజశేఖర్ రెడ్డి తో పాటు ఆయన కుమారుడు జగన్ కనుసన్నల్లో కడప జిల్లా ఉండేది. ప్రత్యేక పరిస్థితుల్లో తప్పించి ఆ జిల్లాలో వారి ప్రభావమే అధికం. కానీ వారితో పోల్చుకుంటే చంద్రబాబుకు రాయలసీమతో పాటు సొంత జిల్లాలో ఆదరణ తక్కువ. దానికి అనేక రకాల కారణాలు కూడా ఉన్నాయి.

Also Read: JC Prabhakar Reddy viral: బండబూతులు.. జెసి ఇక మారడా!

మరోసారి విజయం కోసం..
వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని( YSR Congress) నియంత్రించగలిగితే మరోసారి అద్భుత విజయం దక్కించుకోవచ్చు అని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకవేళ రాయలసీమలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మాత్రం.. ఆ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా సానుకూలంగా మారుతుంది. అందుకే ఎంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకూడదని చంద్రబాబు సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. రాయలసీమలో పర్యటనలు అంటేనే ఆసక్తి చూపుతున్నారు. తాను రాయలసీమ బిడ్డ అని సగర్వంగా చెబుతున్నారు. దీని వెనుక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. తరచూ పర్యటించడం, పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల రాయలసీమ ప్రజల్లో పట్టు పెంచుకోవాలని బాబు ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా పరిశ్రమలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు సైతం కసరత్తు చేస్తున్నారు.

Also Read: Nellore Politics Shift: జగన్ కు షాక్.. వైసీపీకి సీనియర్ నేత గుడ్ బై?

బనకచర్ల అంశంపై..
విభజన హామీల్లో భాగంగా రాయలసీమకు హైకోర్టు( High Court) కేటాయిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రాజధానుల నేపథ్యంలో.. కర్నూలును న్యాయ రాజధాని చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ అదే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి.. రాయలసీమ కోరికను తీర్చే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు బనకచర్లను రాయలసీమను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ నుంచి ఈ ప్రాజెక్టుకు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఈ విషయంలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదు. తెలంగాణ ప్రయోజనాలకు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి సైతం ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నారు. దానిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డి చర్యలను ఏపీ ప్రజలు అసహ్యించుకునేలా ప్రచారం చేయాలని కూటమి భావిస్తోంది. మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డికి ఆయువుపట్టుగా భావించే రాయలసీమలోనే ఆయనను బలంగా దెబ్బ కొట్టాలని చూస్తోంది. మరి అందులో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular