JC Prabhakar Reddy viral: రాష్ట్రంలో తాడిపత్రి( Tadipatri) నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. అక్కడ రాజకీయం చేయడం అంటే కత్తి మీద సామే. అధికారులు విధులు నిర్వహించాలన్న భయమే. అంతలా ఉంటుంది అక్కడ పరిస్థితి. నిత్యం రాజకీయ ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది. దశాబ్దాలుగా అక్కడ జేసీ కుటుంబ హవా నడుస్తూ వస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తరువాత జెసి కుటుంబానికి సవాళ్లు ఎదురయ్యాయి. వైసిపి హయాంలో కేతిరెడ్డి కుటుంబం తన హవాను చాటుకుంటూ వచ్చింది. అయితే కేతిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సైతం తాడిపత్రి మున్సిపాలిటీ కైవసం చేసుకున్నారు జెసి ప్రభాకర్ రెడ్డి. ఇటీవల వారిద్దరి మధ్య గట్టి ఫైట్ ఉంది. నియోజకవర్గంలో కేతిరెడ్డి అడుగు పెట్ట లేకుండా పోయారు.ఒకవైపు రాజకీయ ఆధిపత్యాన్ని పక్కన పెడితే.. పనిచేయని అధికారులపై దుమ్ము దులుపుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
Also Read: JC Prabhakar Reddy VS Madhavi Latha : ఆ హీరోయిన్ ని వదలని జెసి అనుచరులు!.. ఏం చేశారంటే?
ముక్కు సూటి వ్యక్తిత్వం..
ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడతారు. ప్రజా సమస్యలపై అతి వేగంగా స్పందిస్తారు. ఈ క్రమంలో ఓ అధికారి విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు జెసి ప్రభాకర్ రెడ్డి. జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పిన పనులు చేయకపోతే చూస్తూ ఊరుకోబోమని.. ఆఫీసుకు వచ్చి కొడతానని కూడా బెదిరించారు. దీంతో ఆందోళనకు గురైన డిపిఓ నాగరాజు నాయుడు అక్కడ నుంచి భయపడుతూ బయటకు వెళ్ళిపోయారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జెసి ప్రభాకర్ రెడ్డి హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
Also Read: JC Prabhakar Reddy: జెసి వర్సెస్ బిజెపి.. మధ్యలో నటి మాధవి లత
దురుసు ప్రవర్తన పై విమర్శలు..
తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనుల్లో అధికారులు సమర్థవంతంగా పనిచేయడం లేదన్న అభిప్రాయం జెసి ప్రభాకర్ రెడ్డి లో ఉంది. అయితే ప్రజల సమస్యల విషయంలో జెసి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ విధుల్లో ఉన్న అధికారులపై దుర్భాషలు ఆడడం ఎంతవరకు సమంజసం అని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వంలో క్రమశిక్షణ కట్టు దాటుతోందన్న అభిప్రాయం యంత్రాంగంలో ఉంది. చాలా విషయాల్లో జెసి ప్రభాకర్ రెడ్డిని చంద్రబాబు కట్టడి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా జిల్లా అధికారిపై తిట్ల దండకం అందుకోవడం పై హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాడిపత్రిలో జేసీ మళ్లీ వీరంగం
తాను చెప్పినట్లు చేయలేదని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజ నాయుడుని అందరి ముందు ఇష్టమొచ్చినట్లు తిట్టిన జేసీ
బీ కేర్ ఫుల్.. రేపు మీ ఆఫీస్కు వచ్చి కొడతా అంటూ బెదిరింపులు
ఇదేనా @ncbn సంస్కారం?#CBNFailedCM#IdhiMunchePrabhutvam… pic.twitter.com/0f9ek5mPZ5
— YSR Congress Party (@YSRCParty) July 17, 2025