Ration Depos : ఏపీలో రేషన్ డిపోల( ration depos ) ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభం అయింది. ఐదేళ్ల తరువాత నేరుగా రేషన్ కార్డు లబ్ధిదారులు వచ్చి డిపోల వద్ద రేషన్ పొందుతున్నారు. రేషన్ సరఫరా లో బియ్యం పక్కదారిని అరికట్టేందుకు ఎండియు వాహనాలను రద్దు చేసినట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. జూన్ నెలకు సంబంధించిన రేషన్ను నేరుగా డిపోల వద్ద తీసుకోవాలని సూచించింది. జూన్ 1న రాష్ట్రవ్యాప్తంగా వేడుకగా రేషన్ సరఫరాను ప్రారంభించింది. అయితే గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల రేషన్ బియ్యం పట్టుబడుతోంది. దీంతో డిపోల వద్ద రేషన్ ఇచ్చినా.. రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడలేదని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభం అయింది. ఈ ప్రచారం వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి.
* సమూల మార్పులు..
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) అధికారంలోకి వచ్చింది. పౌరసరఫరాల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రారంభించింది. అక్కడకు కొద్ది రోజులకే ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఇంటింటికి రేషన్ పంపిణీకి గాను ఒక్కో వాహనానికి నెలకు 21 వేల రూపాయలను కేటాయించింది. అయితే ఎం డి యూ వాహనాలతో ప్రయోజనాల కంటే మైనస్ అధికంగా ఉంది. నిర్ణీత వ్యవధిలో రేషన్ విడిపించకపోతే ఆ నెల పొందే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఎండియు వాహనాల పుణ్యమా అని రేషన్ భారీగా పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు వృధా ఖర్చును తగ్గించే క్రమంలో కూటమి ప్రభుత్వం ఎండియు వాహనాల వ్యవస్థను రద్దు చేసింది. ఈ నెల నుంచి పాత పద్ధతిలో రేషన్ డిపోల వద్ద బియ్యం అందించేందుకు ఏర్పాటు చేసింది.
Also Read : తెలంగాణ లో ఆ రేషన్ కార్డులు రద్దు
* పట్టుబడుతున్న బియ్యం..
అయితే గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల రేషన్ బియ్యం ( ration rice) పట్టుబడింది. అక్రమంగా రేషన్ తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మీడియాలో ప్రధాన వార్తలు రావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాటిపై పోస్టులు పెట్టడం ప్రారంభించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. రేషన్ అక్రమాలు అరికడతామని పేరుతో ఎండియు వాహనాలను రద్దు చేశారని.. పేదవారి రేషన్ సరఫరాను వృధా ఖర్చు కింద భావించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తోంది. బియ్యం పక్కదారి పట్టకుండా రేషన్ డిపోల వ్యవస్థను తెచ్చామని చెబుతున్నారని.. అలాంటప్పుడు ఈ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడుతుండడం ఏమిటని.. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం ప్రారంభించింది.
* రేషన్ డిపోలపై నిఘా..
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డిపోల ద్వారా పంపిణీ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈనెల 15 వరకు ఈ రేషన్ పంపిణీ జరగనుంది. ఇప్పటికే ప్రభుత్వం షెడ్యూల్( schedule) ప్రకటించింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి 12 వరకు.. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ జరగనుంది. ప్రతి రేషన్ కార్డు దారుడు కి పంపిణీ జరిపేలా ఆదేశాలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అదే సమయంలో రేషన్ డిపోల పై పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు చేపట్టనుంది.