Budget of Hari Hara Veeramallu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) కి చాలా మంచి ఇమేజ్ అయితే ఉంది. ప్రస్తుతం ఆయన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జూన్ 12 వ తేదీన రిలీజ్ అవ్వబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ మొత్తం పూర్తయింది. ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ గా మారుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమాకి 200 కోట్ల వరకు బడ్జెట్ అయితే అయింది. ఇక బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 200 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా మీద ఇప్పుడిప్పుడే భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు అంత పెద్దగా సక్సెస్ లను సాధించకపోవడంతో ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే చూడాలని తమ అభిమానులైతే కోరుకుంటున్నారు.
మరి అత్తారింటికి దారేది(Attarintiki Daredi) సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన అన్ని సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించడం లేదు. మరి ఈ సినిమాతో అయిన పవన్ కళ్యాణ్ సక్సెస్ ను సాధించి మరోసారి కంబ్యాక్ ఇచ్చి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read : ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం..ఫ్యాన్స్ సహనానికి పరీక్ష!
ఇంతకు ముందు ఈ సినిమాకి క్రిష్ (Krish) డైరెక్టర్ గా ఉన్నప్పుడు సినిమా మీద భారీ బజ్ అయితే ఉండేది. కానీ అతను తప్పుకోవడంతో అప్పటినుంచి సినిమా మీద హైప్ అయితే తగ్గుతూ వస్తుంది. ఇక ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయినప్పటికి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కి రెడీ అయినప్పుడు ఎంత హైప్ అయితే ఉంటుందో ఈ సినిమాకి అంతా హైప్ అయితే కనిపించడం లేదు.
మరి ఇలాంటి సందర్భంలో 200 కోట్లకు పైన కలెక్షన్లను ఈ సినిమా రాబడుతుందా పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చూపిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి మొత్తానికి అయితే ఈ సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని సైతం ఈ సినిమాని మొదటి రోజు మొదటి షోనే చూడాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది..