Ration Cards: తెలంగాణ రాష్ట్రంలో గత 6 నెలలుగా రేషన్ తీసుకోని 1.59 లక్షల కార్డులపై కేంద్రం దృష్టి పెట్టింది. దీనిపై విచారణకు పౌర సరఫరాల అధికారులను ఆదేశించింది. ఇప్పటికే 80 శాతం కార్డులను పరిశీలించిన అధికారులు వీటిలో 30 శాతం సరిగా లేవని గుర్తించారు. ఇతర రాష్ట్రాల్లో కార్డులు కలిగి ఉండడం, కార్డు హోల్డర్లు మరణించడం, డూప్లికెట్ ఆధార్ తో కార్డులు పొందడం వంటి లోపాలు ఉన్నాయన్నారు. వీటిలో చాలా కార్డులు రద్దయ్యే అవకాశం ఉందన్నారు.