PV Legacy Event Delhi: చంద్రబాబు( CM Chandrababu) తొలిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న సమయంలో.. ఈ దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు ఉండేవారు. తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థి. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా పీవీ నరసింహారావు పోటీ చేయడంతో సంపూర్ణ సహకారం అందించింది. అంతటి రాజకీయ విలువలు అప్పట్లో నడిచేవి. కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఏర్పడింది. ఎన్టీఆర్ నుంచి పార్టీతో పాటు ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు చంద్రబాబు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్నది ఒక అనుమానం. అయితే ఆ సమయంలో దేశ ప్రధానిగా తెలుగు నేత పీవీ నరసింహారావు ఉండేవారు. అయితే అప్పటికే ఆర్థిక సంస్కరణలతో పాటు ఐటీ అభివృద్ధికి బీజం వేశారు పివి నరసింహారావు. అప్పుడు ఆయనతో ఐటి అభివృద్ధి విషయంలో అభిప్రాయాలను పంచుకున్నారు సీఎం. తాజాగా అదే విషయాన్ని చెప్పుకొచ్చారు బాబు. నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
గొప్ప రాజ నీతిజ్ఞుడు
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు( PV Narasimha Rao )గొప్ప రాజ నీతిజ్ఞుడని కొనియాడారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో లైఫ్ అండ్ లెగసి పీవీ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. 17 భాషలు నేర్చుకున్న పీవీ నరసింహారావు ఏపీకి ముఖ్యమంత్రిగా సేవలందిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది పీవీ నరసింహారావు అని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశాన్ని ప్రగతి పథంలో నిలబెట్టిన వ్యక్తి కూడా పీవీ నరసింహారావు అని కొనియాడారు చంద్రబాబు. అటువంటి వ్యక్తితో కలిసి పనిచేసిన వైనాన్ని ప్రస్తావించారు. 1995లో ఏపీకి సీఎం అయ్యారు చంద్రబాబు. అప్పట్లో పిఎంగా ఉన్న పీవీ నరసింహారావు తో మంచి సంబంధాలే కొనసాగించారు. అప్పట్లో ఇద్దరి ఆలోచనలు ఒకలానే ఉండేవని ఇదే వేదికపై గుర్తు చేశారు చంద్రబాబు.
Also Read: TDP Second Governor Nominee: టిడిపికి రెండో గవర్నర్.. ఛాన్స్ ఆయనకే?!
అప్పుడే ఐటీ ప్రవేశం..
అప్పుడప్పుడే దేశంలో ఐటీ ( information technology) ప్రవేశించింది. ప్రధాని పీవీ నరసింహారావు అప్పట్లో దీనిని గుర్తించారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని భావించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకెళ్లాలని భావించారు. అందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబును అప్పట్లో పిలిపించి మాట్లాడారు. ఆ సందర్భంలోనే విదేశాల్లో ఉన్న సెల్ ఫోన్ సేవలను ఏపీలో విస్తరించాలన్న ఆలోచనను చేశారు చంద్రబాబు. అదే విషయాన్ని ప్రధాని పీవీతో ప్రస్తావించారు. ఆ సమయంలో చంద్రబాబు ఆలోచనలను ఎక్కువ మంది హేళన చేశారట. కానీ 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సెల్ఫోన్లను అందుబాటులోకి తెచ్చారు. ఏపీలో సెల్ఫోన్ రంగాన్ని విస్తరించాలని భావించి సొంత పార్టీ నేతలకు రిలయన్స్ సెల్ ఫోన్ లను నాడు అందించారు. ప్రధాని పీవీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పాత సంగతులను నెమరు వేసుకున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఇవే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పీవీ నరసింహా రావుతో ఆ రోజు సెల్ ఫోన్ తీసుకువద్దాం లేదంటే చైనా ముందుకు దూసుకుపోతుంది అంటే అందరూ నామీద జోకులు వేశారు pic.twitter.com/9ttxIhJr59
— Telugu Scribe (@TeluguScribe) July 15, 2025