Homeఎంటర్టైన్మెంట్Brahmamudi Kavya: క్యాస్టింగ్ కౌచ్ పై బ్రహ్మముడి కావ్య షాకింగ్ కామెంట్స్, నాకు కూడా ఎదురైంది...

Brahmamudi Kavya: క్యాస్టింగ్ కౌచ్ పై బ్రహ్మముడి కావ్య షాకింగ్ కామెంట్స్, నాకు కూడా ఎదురైంది అంటూ

Brahmamudi Kavya: తనకు కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఉన్నాయంటూ ఓపెన్ అయ్యింది బ్రహ్మముడి కావ్య. పరిశ్రమకు వచ్చిన అమ్మాయిలు అందరూ అలాంటి వారే. అందుకే వారికి అవకాశాలు వస్తాయని భావిస్తారు అంటూ కీలక కామెంట్స్ చేసింది.

తమిళనాడులో పుట్టిన దీపిక రంగరాజు(Deepika Rangaraju) సీరియల్ నటిగా అరంగేట్రం చేసింది. తమిళ సీరియల్స్ లో నటించింది. అనంతరం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మోస్ట్ పాప్యులర్ సీరియల్స్ లో ఒకటైన బ్రహ్మముడి సీరియల్ లో లీడ్ రోల్ చేస్తుంది దీపిక. కావ్య పాత్రలో ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. మరో లీడ్ రాజ్ పాత్రను మానస్ చేస్తుండగా… అతని భార్యగా దీపిక కనిపిస్తుంది. ఇక వీరిద్దరి మధ్య గిల్లికజ్జాలు హైలెట్ అని చెప్పాలి. మొదట్లో బ్రహ్మముడి సీరియల్ కి బాగానే ఆదరణ దక్కింది.

Also Read: జబర్దస్త్ శాంతి స్వరూప్ తో హైపర్ ఆది జలకాలు, వైరల్ వీడియో!

ప్రమాదంలో రాజ్ గతం మర్చిపోవడం, వేరొక అమ్మాయి ఇంటికి వెళ్లడం, ఆమె రాజ్ ని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయడం… ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో డ్రామా. ఇదంత గజిబిజిగా ఉంది. ప్రేక్షకులు ఏమంత ఎంటర్టైన్ కావడం లేదు. రాత్రివేళ ప్రైమ్ టైం లో ప్రసారం కావాల్సిన ఈ సీరియల్ ని మధ్యాహ్నానికి మార్చారు. ఇక బ్రహ్మముడి సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న దీపిక పలు టెలివిజన్ షోలలో సందడి చేస్తుంది. వచ్చీ రాని తెలుగులో ఆమె వేసే పంచులు అలరిస్తాయి. ఇక కావ్య ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

తాను పాల్గొన్న ప్రతి షోలో దీపిక హైలెట్ అవుతుంది. ఒక్కోసారి ఆమె పంచులు శృతి మించుతాయి. హీరో నాని తో కలిసి ఓ యాడ్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే.. తాజాగా దీపిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సదరు షోకి జబర్దస్త్ వర్ష యాంకర్ కాగా… క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) గురించి దీపికను అడిగింది. వర్ష ప్రశ్నకు సమాధానంగా.. మనం అలాంటి వాళ్ళం కాకపోయినప్పటికీ అలాంటి వాళ్ళమే అని కొందరు ఫిక్స్ అవుతారు. అలాంటి పనులు చేసే ఈ స్థాయికి వచ్చామని అనుకుంటారు. చదువుకున్న వాళ్ళు కూడా అలానే భావిస్తారు. నాకు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.

Also Read:  కొడుకులకు కి సక్సెసులు అందించలేకపోయిన మన స్టార్ హీరోలు…

బుల్లితెర 100 శాతం ఫ్యూర్ ఘీ వంటిది. సినిమా పరిశ్రమ కూడా మంచిదే. కానీ కొందరు వేస్ట్ పీపుల్ అలాంటి పనులు చేస్తారు. నిజంగా సినిమాలు చేసే వాళ్ళు క్యాస్టింగ్ కౌచ్ కి పాల్పడరు. కొందరు సినిమా పేరుతో క్యాస్టింగ్ కౌచ్ చేస్తారు. నాకు అలాంటి వారు ఎదురైనప్పుడు నేను వార్నింగ్ ఇవ్వను. జస్ట్ అవైడ్ చేస్తాను… అంటూ చెప్పుకొచ్చింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్ట్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను సైతం దీపిక ఖండించింది. అవన్నీ అపోహలే అని స్పష్టత ఇచ్చింది.

Exit mobile version