Property Tax
Property Tax : ఏపీలో ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ శుభవార్త తెలిపింది. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ పురపాలకశాఖ నిర్ణయం తీసుకుంది. భవనాలు, ఖాళీ స్థలాలపై ప్రస్తుత సంవత్సరం చెల్లించాల్సిన మొత్తంతో పాటు, పాత బకాయిలపై వడ్డీని 50 శాతం మేర మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 మార్చి 31లోగా చెల్లించే బకాయిలకు మాత్రమే 50 శాతం వడ్డీ మాఫీ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పేరుకు పోయిన కోట్లాది రూపాయల ఆస్తి పన్ను బకాయిల వసూళ్ల కోసం వడ్డీ రాయితీ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రంలో చాలా కాలం నుంచి ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. వీటిని వసూలు చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వలన సామాన్య ప్రజలకు కొంత ఆర్థిక భారం తగ్గుతుంది. అదే సమయంలో, మున్సిపల్ శాఖకు కూడా కొంత ఆదాయం వస్తుంది. అయితే, ఈ రాయితీ 2025 మార్చి 31 వరకు మాత్రమే ఉంటుంది. కావున, బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. గతంలో మాదిరిగా పూర్తి వడ్డీ మాఫీ కాకపోయినా ఈ సారి కేవలం 50శాతం మాత్రమే వడ్డీ మాఫీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో కనీసం సగం బకాయిలు అయినా వసూలవుతాయని అధికారుల అంచనాగా తెలుస్తోంది.
Also Read : 20 లక్షల ఉద్యోగాలు.. తొలి ఏడాది ఐదు లక్షలు.. ప్రభుత్వ టార్గెట్ అదే.. లోకేష్ కీలక ప్రకటన!
కొంతమంది మొండి బకాయిదారులు మునిసిపల్ అధికారులు, సిబ్బంది పట్ల బెదిరింపులకు దిగుతున్నారు. దీనివలన ఆస్తి పన్ను వసూలు చేయడానికి వెళ్ళే సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్, పట్టణ ప్రణాళిక విభాగాల్లోని సిబ్బందిపై గత కొన్నేళ్లుగా అవినీతి ఆరోణలు వస్తున్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా.. ఆస్తి పన్ను అసెస్‌మెంట్ చేసేందుకు సర్వే చేయాలన్నా ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన దుస్థితి ఉంది.
రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో కోట్లాది రూపాయల ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. వీటి వసూలుకు మున్సిపల్ శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే, ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. అలాగే, కొన్ని చోట్ల ఆస్తి పన్ను వసూలుకు వెళ్ళే సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి. మున్సిపల్ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం వడ్డీ రాయితీ ప్రకటించింది. ఈ రాయితీ వలన ప్రజలు తమ బకాయిలను చెల్లించడానికి ముందుకు వస్తారని ప్రభుత్వం ఆశిస్తోంది.
Also Read : తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. కలెక్టర్ల సదస్సులో సీఎం సంచలన ప్రకటన!
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Property tax municipal department gives good news to property tax defaulters in ap
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com