Minister Nara Lokesh : చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలన్నది కూటమి ప్రభుత్వ( Alliance government ) లక్ష్యం. గత కొన్నేళ్లుగా ఏపీలో పరిశ్రమల స్థాపన జరగలేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదు. ముఖ్యంగా గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల కల్పన అనేది ప్రకటనలకే పరిమితం అయింది. ఈ తరుణంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ప్రధానంగా మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేశారు. మొన్న ఆ మధ్యన అమెరికా వెళ్లారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుసగా సమావేశం అయ్యారు. అయితే పరిశ్రమలతో పాటు ప్రపంచంలో మేటి సంస్థలు ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ తరుణంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలు కదుపుతోంది. దీనికి సంబంధించి మంత్రుల ఉప సంఘాన్ని కూడా నియమించింది. ఆ ఉపసంఘం శరవేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఈరోజు ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రివర్గ ఉప సంఘం తో సమావేశం అయ్యారు నారా లోకేష్( Minister Nara Lokesh )

Also Read : తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. కలెక్టర్ల సదస్సులో సీఎం సంచలన ప్రకటన!
* కూటమి లక్ష్యం అదే
కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు పెట్టుబడుల పైన ఎక్కువగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకోవాలని కూడా చూస్తోంది. ఈ తరుణంలో ఇప్పటివరకు సాధించిన పెట్టుబడులు, త్వరలో రాబోయే పారిశ్రామిక సంస్థలు, ఆ ప్రయత్నంలో జరిగిన పురోగతి, చేసుకున్న ఒప్పందాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్( PowerPoint presentation ) ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు. ఇప్పటివరకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా రూ. 8,73,220 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని.. తద్వారా 5, 27,824 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని వివరించారు అధికారులు. అంటే ఇది వార్షిక ప్రగతి అన్నమాట. ఇంకా ప్రభుత్వానికి నాలుగేళ్ల వ్యవధి ఉంది. ఈ నాలుగు సంవత్సరాల్లో అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతామని అధికారులు నమ్మకంగా చెబుతున్నారు.
* నారా లోకేష్ దిశా నిర్దేశం
కాగా మంత్రివర్గ ఉప సంఘం( cabinet Sab committee ) చైర్మన్ హోదాలో ఉన్న మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా మంత్రులకు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ పోర్టల్ ను సమర్థంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక సంస్థలకు భూ కేటాయింపులు, అనుమతులకు సంబంధించిన అన్ని వివరాలు ట్రాకర్ లో ఉంచాలని సూచించారు. పెట్టుబడులు పట్టేందుకు ముందుకు వచ్చే వారికి నిబంధనలు, అనుమతులు మరింత సరళతరం చేయాలని కూడా ఆదేశించారు లోకేష్. ముఖ్యంగా పరిశ్రమల విస్తరణకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని.. పారిశ్రామికవేత్తలకు నమ్మకం పెరిగేలా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు లోకేష్.

* గత అనుభవాల దృష్ట్యా..
రాష్ట్రంలో గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పాలనలో పారిశ్రామిక విధానం దారుణంగా మారింది. కొత్త పరిశ్రమల జాడలేదు. ఉన్న పరిశ్రమల విస్తరణకు నోచుకోలేదు. అటువంటి వాటికి ప్రోత్సాహం లేదు కూడా. అందుకే అమర్ రాజా వంటి కంపెనీ తన ఉత్పత్తులను తెలంగాణలో విస్తరించేందుకు నిర్ణయించింది. మరోవైపు గత ఐదేళ్లలో చాలా పరిశ్రమలకు రాజకీయ ఇబ్బందులు ఎదురయ్యాయి. కమీ షన్ల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవల ఓ మాజీ మహిళా మంత్రిపై ఇవే తరహా ఆరోపణలు వచ్చాయి. అందుకే ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ సహచర మంత్రులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు అయింది. ఒకవైపు అధికారులకు దిశా నిర్దేశం చేస్తూనే.. మరోవైపు అధికారులకు సైతం పారిశ్రామిక విధానాలు, ఉద్యోగాల కల్పన విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగలిగారు. మొత్తానికి అయితే మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడులు, ఇక రాబోయే పెట్టుబడులు.. ఆపై ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థమయ్యేలా చెప్పారు నారా లోకేష్. మొత్తానికి అయితే కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో కీలక సందేశం ఇచ్చినట్లు అయింది
Also Read : జగన్ అడ్డాలో క్యాంపు పాలిటిక్స్.. గట్టిగానే కూటమి సవాల్!