AP Election Results: వైసీపీకి(YCP) ఇది క్లిష్ట సమయం. ఆ పార్టీ ఒంటరి పోరాటం చేసింది. టిడిపి కూటమి కట్టింది. అందునా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో(BJP) జత కట్టింది. ఆ పార్టీతో కలిసి పోటీ చేసింది. అందుకే వ్యవస్థలపరంగా టిడిపి(TDP) కూటమికి అన్ని విధాలా సహకారం అందింది. అయితే ఈ సహకారం ఎలా ఉంటుందో జగన్(Jagan) కు తెలియంది కాదు. గత ఎన్నికల్లో జగన్ ఎన్డీఏలో చేరకపోయినా.. చంద్రబాబుపై(Chandrababu) ఉన్న కోపంతో కేంద్రం వైసిపికి అంతలా సహకారం అందించింది. అప్పట్లో టిడిపి అధికారంలో ఉండి ఎన్నికలను ఫేస్ చేసినా.. వైసీపీ మాట చెల్లుబాటు అయ్యింది. ఆ పార్టీ కోరినట్టే అధికారుల మార్పు జరిగింది. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చేశారు. డీజీపీని మార్చేశారు. ఇంటలిజెన్స్ విభాగం ఐజిని మార్చారు. అన్ని జిల్లాల కలెక్టర్లను మార్చారు. ఎస్పీలను మార్చారు. కానీ ఈ ఎన్నికల్లో జగన్ కు అదే రిపీట్ అయింది. టిడిపి కూటమికి అంతులేని సహకారం అందింది.
Also Read: AP Election Results 2024 : తొలి ఫలితం ఆ నియోజకవర్గానిదే!
ఇప్పుడు ఫలితాలు ముందు వైసిపికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అది మరిచిపోక ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు విషయంలో సైతం.. వైసీపీ దాఖలు చేసిన పిటీషన్ అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఈ విషయంలో కలుగజేసుకోలేమని తేల్చి చెప్పింది. కౌంటింగ్ కు ముందు విచారించలేమన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. దీంతో వైసిపి చివరి ప్రయత్నం కూడా ఫలించలేదు.ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓట్లు చెల్లుబాటు అవుతుండడం ఆ పార్టీకి ప్రమాదకరమే. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై రిటర్నింగ్ అధికారుల హోదా, సీల్ లేకపోయినా.. సంతకం ఉంటే చాలు అని ఎలక్షన్ కమిషన్ మినహాయింపు ఇచ్చింది. అయితే ఆ రెండు వర్గాల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకు పడవని గ్రహించిన వైసిపి.. వీలైనంతవరకు ఓట్లు చెల్లుబాటు కాకుండా చూడాలని ప్రయత్నించింది. కానీ న్యాయస్థానాలకు వెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో ఒకటో రౌండ్ నుంచే వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది
Also Read: Andhra Pradesh: సంక్షేమం వైపా.. అభివృద్ధి వైపా.. ఏపీ ప్రజలు ఎటువైపు?
మరోవైపు ఎగ్జిట్ పోల్స్ కంటిమీద కునుకు లేకుండా చేశాయి. జాతీయ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు ఏకపక్షంగా టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చేశాయి. దీంతో ఏం చేయాలో తెలియడం లేదు. ఎలా ధైర్యం చెప్పాలో మార్గం కనిపించడం లేదు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కానీ ఆయన మాటలతో సంతృప్తి చెందలేదు. ఏకంగా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ అక్కడ రద్దు అయింది. అక్కడి నుంచి సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టారు. కానీ అనుకున్నది సాధించలేకపోయారు. ఇలా వరుస దెబ్బ మీద దెబ్బలు పడుతుండడంతో.. ఏం చేయాలో తెలియక రేపు కౌంటింగ్ కు సిద్ధపడుతున్నారు. అయితే సగటు వైసీపీ అభిమాని మాత్రం తల్లడిల్లి పోతున్నారు.