Homeఆంధ్రప్రదేశ్‌Posani Krishna Murali: స్వరం మార్చిన పోసాని.. అరెస్ట్ భయమేనా?

Posani Krishna Murali: స్వరం మార్చిన పోసాని.. అరెస్ట్ భయమేనా?

Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళి భయపడుతున్నారా? కూటమి ప్రభుత్వ చర్యలతో ఆందోళనతో ఉన్నారా? తనపై కేసులు తప్పవని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు ముందుకు వచ్చారు పోసాని కృష్ణ మురళి. ఆయన పై సైతం చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసైనికులు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. వైసిపి హయాంలో మెగా కుటుంబంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు మెగా అభిమానులు. ఒకానొక దశలో హైదరాబాదులో పోసాని ఇంటి పై దాడికి కూడా ప్రయత్నించారు. అప్పట్లో పోసానిపై జన సేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో నామమాత్రం కేసు పెట్టారు పోలీసులు. కనీసం అరెస్టు కూడా చేయలేదు. చిన్నపాటి నోటీసు ఇచ్చి చేతులు దులుపుకున్నారు . ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులతో పాటు నాడు అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ తరుణంలో పోసాని కృష్ణ మురళి పై మరోసారి జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోసానిని అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో పోసాని మీడియా ముందుకు వచ్చిప్రభుత్వ చర్యలను తప్పుపట్టడం విశేషం.

* జగన్ కు గట్టి మద్దతు దారుడు
వైసిపి తో పాటు జగన్ కు గట్టి మద్దతుదారుడు పోసాని కృష్ణ మురళి. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. అదే సమయంలో చంద్రబాబుతో పాటు పవన్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేసేవారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి జగన్ పోసానిని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిలో కూర్చోబెట్టారు. అయితే అది చిత్ర పరిశ్రమకు సంబంధించిన పదవీ అయినా.. ఎన్నడు చిత్ర పరిశ్రమ గురించి పోసాని మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ జగన్ పై ఈగ వాలనిచ్చేవారు కాదు. 2022లో పవన్ అప్పటి ప్రభుత్వం పై విమర్శలు చేస్తే.. పోసాని కృష్ణ మురళి వ్యక్తిగత కామెంట్లకు దిగారు. అదే వివాదానికి కారణమైంది. ఇప్పుడు మరోసారి అదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు.

* వరుస అరెస్టులతో
వరుస అరెస్టుల నేపథ్యంలో పోసాని కృష్ణ మురళి లో ఒక రకమైన భయం కనిపిస్తోంది. వైసిపి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి పై కడప జిల్లాలో కేసు నమోదు అయ్యింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీస్ జారీ చేశారు. మరోవైపు రాష్ట్రస్థాయి సోషల్ మీడియా ప్రతినిధులుగా ఉన్న వర్రా రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డి ల అరెస్టు సైతం జరిగింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాష్ట్రస్థాయి వారిని పోలీసులు విడిచి పెట్టడం లేదు. అటువంటిది తనను విడిచి పెట్టరని పోసాని కృష్ణ మురళి భావిస్తున్నారు. అయితే ఫలితాలు వచ్చిన వెంటనే సైలెంట్ అయ్యారు రాంగోపాల్ వర్మ. ఆయనపై సైతం తాజాగా కేసు నమోదు అయింది. అరెస్టు ఉంటుందని ప్రచారం సాగుతోంది. అరెస్టుల భయంతోనే పోసాని అలా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో అరెస్టులు ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version