Bangalore Weather Report : నైరుతి రుతుపవన కాలం ముగిసింది. ఈశాన్య రుతుపవనాలు వీస్తున్నాయి. అయినా.. దేశంలోని నైరుతి ప్రభావిత రాష్ట్రాల్లోనూ ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల కాలంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురిసేవి. కానీ, ఇప్పుడు తెలంగాణ, కర్ణాటకలోనూ వనాలు కురుస్తున్నాయి. తాజాగా భాత వాతావరణ కేంద్రం బెంగళూరుకు వర్ష సూచన చేసింది. ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బెంగళూరులోనూ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉష్ణోత్రలు ఇలా…
బెంగళూరు సిటీలో బుధవారం(నవంబర్ 13న) కనిష్ట ఉష్ణోగ్రతలు 19.26 డిగ్రీల సెల్సియస్‌గా, గరిష్ట ఉష్ణోగ్రత 25.18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో తేమ 68 శాతం వరకు ఉంటుందని వెల్లడించింది. వర్షం పడే అవకాశం ఉండడంతో చలి ప్రభావం కూడా పెరుగుతుంది. ఈదురు గాలులు వీసే అవకాశం ఉంది.
రేపటి నుంచి ఇలా..
ఇక బెంగళూరులో గురువారం నుంచి రాబోయే ఐదు రోజులు వాతావరణం ఎలా ఉంటుందో కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండీ అంచనా ప్రకారం..
గురువారం : నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 26.17 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రత 19.11 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది.
శుక్రవారం : గరిష్ట ఉష్ణోగ్రత 25.79 డిగ్రీల సెల్సియస్ మరియు కనిష్ట ఉష్ణోగ్రత 19.18 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చు. మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది.
శనివారం : గరిష్ట ఉష్ణోగ్రత 25.5 డిగ్రీల సెల్సియస్ మరియు కనిష్ట ఉష్ణోగ్రత 18.7 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చు. మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది.
ఆదివారం : గరిష్ట ఉష్ణోగ్రత 26.35 డిగ్రీల సెల్సియస్ మరియు కనిష్ట ఉష్ణోగ్రత 18.07 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చు. ఆకాశంలో మేఘాలు ఉంటాయి.
సోమవారం : గరిష్ట ఉష్ణోగ్రత 26.03 డిగ్రీల సెల్సియస్ మరియు కనిష్ట ఉష్ణోగ్రత 17.73 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చు. ఆకాశంలో మేఘాలు ఉంటాయి.
మంగళవారం : గరిష్ట ఉష్ణోగ్రత 25.69 డిగ్రీల సెల్సియస్ మరియు కనిష్ట ఉష్ణోగ్రత 16.46 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చు. ఆకాశంలో మేఘాలు ఉంటాయి.