Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి( Posani Krishna Murali ) అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోసాని కృష్ణ మురళి చాలా దూకుడుగా ఉండేవారు. ఆ పార్టీకి బలమైన మద్దతు దారుడిగా నిలిచారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏపీ ఫిలిం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు. అప్పట్లో చంద్రబాబుతో పాటు పవన్ లపై విరుచుకు పడడంలో ముందుండే వారు పోసాని కృష్ణ మురళి. దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణ మురళి పై నమోదైన కేసుకు సంబంధించి అరెస్టు చేశారు పోలీసులు. నిన్న రాత్రి హైదరాబాదులో అరెస్ట్ చేసిన తర్వాత.. ఈరోజు ఓబులవారిపల్లెకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరు పరిచేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
Also Read: రాజకీయాల నుంచి రాజ్ భవన్ కు.. ఆ సీనియర్ నేత ఆశ ఫలిస్తుందా?
* వైద్య పరీక్షల నిర్వహణ
ఈరోజు మధ్యాహ్నం కి పోసాని కృష్ణ మురళిని ఓబులావారిపల్లెకు( Obulavaripalle ) తీసుకొచ్చారు. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే అతనికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు అక్కడి డాక్టర్లు. ప్రస్తుతం పోసాని ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని అక్కడి మెడికల్ ఆఫీసర్ ధ్రువీకరించారు. గుండె సంబంధిత సమస్యలతో ఆయన మందులు వాడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. వైద్య పరీక్షల తర్వాత పోలీసుల విచారణకు పోసాని సిద్ధమైనట్లు మెడికల్ ఆఫీసర్ గురు మహేష్ తెలిపారు. ఈ విచారణ తర్వాత ఆయనను కోర్టులో హాజరు పరచబోతున్నారు.
* కొద్ది నెలల కిందటే ప్రత్యేక ప్రకటన
అయితే కొద్ది నెలల కిందట తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali) ప్రకటించారు. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడనని కూడా తేల్చి చెప్పారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన దూరం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా పోసాని అరెస్టు జరగడంతో జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పోసాని అరెస్టును ఖండించారు. ఆయన భార్యకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అప్రజా స్వామికంగా వ్యవహరిస్తున్నారని.. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి.
* రంగంలోకి లీగల్ టీం
మరోవైపు పోసాని కృష్ణ మురళికి న్యాయ సహాయం అందించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ లీగల్ టీం( YSR Congress legal team) ఓబులవారిపల్లి వెళ్ళింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని లాయర్లు బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు హైకోర్టు న్యాయవాది ఒకరు వాసాని కోసం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే పోసాని కృష్ణ మురళిని ఓబులా వారి పల్లెకు తీసుకొచ్చారని తెలిసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు.
Also Read: నేరుగా బెడ్ రూమ్ లోకి వచ్చి.. ఏపీ పోలీసులపై పోసాని భార్య సంచలన కామెంట్స్!