Posani Krishna Murali: గత ఐదు సంవత్సరాలుగా ఎగిరి పడిన వారిలో పోసాని కృష్ణ మురళి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందంజలో ఉండేవారు. వైసీపీ ఓటమితో వీరు ఎక్కడా కనిపించడం లేదు. కనీసం మీడియాకు కూడా దొరకడం లేదు. ఒక పెగ్గేసి రాంగోపాల్ వర్మ చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. బూతు సినిమాలు చూస్తే కానీ నాకు పొద్దుపోదు అంటూ బాహటంగానే చెప్పుకొచ్చేవారు ఆర్జీవి. వైసీపీకి వీరాభిమాని. ఇందుకుగాను జగన్ కు అనుకూలంగా సినిమాలు తీసి తనను తాను తగ్గించుకున్నారు రాంగోపాల్ వర్మ.పోసాని కృష్ణ మురళి గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. ఆయన విధేయతను గమనించి జగన్ ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఛాన్స్ ఇచ్చారు. కానీ సినీ పరిశ్రమ కంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరూ కనీసం సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా లేకపోవడం విశేషం.
భారతదేశ చలన చిత్ర రంగంలో రామ్ గోపాల్ వర్మ ది ప్రత్యేక స్థానం. శివ అనే తెలుగు సినిమాతో షేక్ చేశారు. అనతి కాలంలోనే బాలీవుడ్ స్థాయికి ఎదిగారు. బాలీవుడ్ ప్రముఖులు సైతం రామ్ గోపాల్ వర్మతో సినిమాలు తీసేందుకు ఎదురు చూసేవారు. అటువంటి ఆర్జీవి తెలుగు రాజకీయాల్లో చిక్కుకొని.. తనను తాను తగ్గించుకున్నారు. ముఖ్యంగా టిడిపిని టార్గెట్ చేసుకున్నారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ విషం చిమ్మే ప్రయత్నం చేశారు. వ్యూహం సినిమాతో ముందుకు వచ్చారు. రెండు శపధాలు కూడా తీశారు. అయినా సరే పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఎన్నికల ఫలితాల్లో వైసిపి దారుణ పరాజయంతో ఏకంగా సోషల్ మీడియా నుంచి సైతం అదృశ్యమయ్యారు.
వైసీపీకి పోసాని కృష్ణ మురళి వీరాభిమాని.మాజీ సీఎం జగన్ కైతే భక్తుడు. నేను ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యుడిని కానంటూనే వైసీపీ కండువా కప్పుకొని.. నీచ భాషతో విమర్శలు చేసేవారు. జగన్ మెప్పు కోసం చంద్రబాబు, పవన్, లోకేష్ లపై రెచ్చిపోయేవారు. వ్యక్తిగతంగా కామెంట్స్ చేసేవారు. అసలు రాజకీయాలతో సంబంధం లేని ప్రజలను కూడా విడిచిపెట్టలేదు. రాజధానికి భూమిలిచ్చిన రైతు కుటుంబంలోని మహిళలను సైతం కించపరిచారు. అయితే వైసిపి ఓటమితో ఈ ఇద్దరి నోటికి తాళం పడింది. నవరంద్రాలు మూసుకొని కూర్చున్నారు. తాము చేసింది కరెక్ట్ అని వాదించే వితండవాదులు వీరు. అందుకే వీరినిదారిలో తెచ్చుకోకపోతే మరింతమంది పుట్టుకొచ్చే అవకాశం ఉంది. అందుకే కూటమి ప్రభుత్వం వీరిపై సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవికి పోసాని ఇంకా రాజీనామా చేయలేదు. ఇకనుంచి రాజకీయ సినిమాలు చేయనని రాంగోపాల్ వర్మ ప్రకటించారు. కానీ ఈ ఇద్దరు సోషల్ మీడియాని విడిచిపెట్టడం గమనార్హం.