Ind Vs Zim: అతడికి ఇదే చివరి అవకాశం.. ఆడితే జట్టులో ఉంటాడు.. లేకుంటే అస్సాం వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకోవాల్సిందే..

టీమిండియాలో అంతా బాగానే ఉన్నప్పటికీ.. యంగ్ ఆటగాడు, ఫ్యూచర్ కెప్టెన్ గా భావిస్తున్న ఓ ప్లేయర్ కు ఇదే చివరి అవకాశం అని తెలుస్తోంది. టి20 ఫార్మాట్ లో అతడు తరచూ విఫలమవుతున్నాడు. దీంతో అతనిపై బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇంతకీ ఆ యంగ్ కెప్టెన్ ఎవరంటే.. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది.. అతడు శుభ్ మన్ గిల్ అని.. బీసీసీఐ ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ గిల్ విఫలమవుతున్నాడు. దారుణమైన ఆట తీరితో జట్టుకు భారంగా మారిపోయాడు. మరోవైపు అతడి స్నేహితుడు అభిషేక్ శర్మ రెండవ టి20 మ్యాచ్ లోనే సెంచరీ కొట్టేశాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 10, 2024 2:35 pm

Ind Vs Zim

Follow us on

Ind Vs Zim: మరికొద్ది గంటల్లో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా టీమిండియా – జింబాబ్వే మధ్య మూడవ టి20 మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్లో జింబాబ్వే విజయం సాధించింది. రెండో మ్యాచ్లో టీమిండియా బౌన్స్ బ్యాక్ అన్నట్టు ఆడింది. ఏకంగా 100 పరుగుల తేడాతో గెలుపును దక్కించుకుంది. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత యువ జట్టు ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తోంది.. ఐపీఎల్ లో విజయవంతమైన ఆటగాళ్లకు ఈ సిరీస్ ద్వారా బీసీసీఐ అవకాశం కల్పించింది.. అయితే టి20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉన్న కొంతమంది ఆటగాళ్లు జింబాబ్వే వెళ్లడం ఆలస్యం కావడంతో.. మొదటి రెండు మ్యాచ్లకు మాత్రమే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. తాజాగా బీసీసీఐ మిగతా మూడు మ్యాచ్లకు నూతన జట్టును ప్రకటించింది. టి20 వరల్డ్ కప్ లో రిజర్వ్ బెంచ్ కు పరిమితమైన యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివం దూబే(టి20 వరల్డ్ కప్ లో ఆడాడు) తిరిగి టీమ్ ఇండియాలోకి వచ్చేశారు. వీరు రావడంతో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేష్ శర్మ జట్టులో స్థానాన్ని కోల్పోయారు. యశస్వి జైస్వాల్, సంజు, దూబే రాకతో టీమ్ ఇండియా మరింత బలోపేతం అయింది. దీంతో బుధవారం జింబాబ్వే తో జరిగే మూడవ టి20 మ్యాచ్ లో అంతకుమించి అనేలాగా తల పడనుంది.

అయితే టీమిండియాలో అంతా బాగానే ఉన్నప్పటికీ.. యంగ్ ఆటగాడు, ఫ్యూచర్ కెప్టెన్ గా భావిస్తున్న ఓ ప్లేయర్ కు ఇదే చివరి అవకాశం అని తెలుస్తోంది. టి20 ఫార్మాట్ లో అతడు తరచూ విఫలమవుతున్నాడు. దీంతో అతనిపై బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇంతకీ ఆ యంగ్ కెప్టెన్ ఎవరంటే.. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది.. అతడు శుభ్ మన్ గిల్ అని.. బీసీసీఐ ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ గిల్ విఫలమవుతున్నాడు. దారుణమైన ఆట తీరితో జట్టుకు భారంగా మారిపోయాడు. మరోవైపు అతడి స్నేహితుడు అభిషేక్ శర్మ రెండవ టి20 మ్యాచ్ లోనే సెంచరీ కొట్టేశాడు. అతడు కనుక ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే ఓపెనర్ గా స్థిరపడతాడు. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ 20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశారు. 2026 t20 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని టీమిండియా ఓపెనర్ల కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. అభిషేక్ శర్మ కనుక క్లిక్ అయితే అతడు కచ్చితంగా ఓపెనర్ గా ప్రమోషన్ పొందుతాడు. మరవైపు యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రుతు రాజ్ గైక్వాడ్ కూడా పోటీలో ఉన్నారు. రెండవ టి20 మ్యాచ్లో రుతురాజ్ ధాటిగా ఆడాడు. ఒకవేళ మీరు ముగ్గురు కనుక వారి స్థాయిలో ప్రతిభ చూపితే ఎవరో ఒకరికి రెండవ అవకాశం లభిస్తుంది. అప్పుడు గిల్ జట్టు నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.

గిల్.. ప్రస్తుత యువజట్టుకు కెప్టెన్ గా ఉన్నప్పటికీ.. గత పది టి20 మ్యాచ్లలో కేవలం ఒకే ఒక హాఫ్ నుంచి మాత్రమే చేశాడు. అందువల్లే అతడిని t20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయలేదు. జింబాబ్వే టూర్ ద్వారా అయినా అతడు టచ్ లోకి వస్తాడని భావిస్తే పెద్దగా రాణించ లేకపోతున్నాడు. జింబాబ్వేతో మొదటి ఇటువంటి మ్యాచ్లో 34 రన్స్ చేసిన అతడు.. రెండవ టి20 మ్యాచ్లో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో మూడవ టి20 మ్యాచ్లో అతడు ఆడే విధానం పైనే భవిష్యత్తు ఆధారపడి ఉంది. వరుసగా మూడు మ్యాచ్లలో తన సత్తా చాటితోనే.. జట్టులో మునగడ ఉంటుంది. లేకుంటే బ్యాగ్ ప్యాక్ చేసుకొని, అస్సాం వెళ్లిపోవాల్సి ఉంటుందని మాజీ క్రీడాకారులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియాలో ప్రతి స్థానం కోసం విపరీతమైన పోటీ ఉంది. కనీసం ఐదు నుంచి ఆరుగురు ఆటగాళ్లు ఒక్కో స్థానం కోసం పోటీ పడుతున్నారు. భవిష్యత్తులో ఐసీసీ మెగా టోర్నీలు ఉండడంతో.. మెరుగ్గా ఆడే వారికే అవకాశాలు కల్పించాలని బిసిసిఐ ఇప్పటికే నిర్ణయించింది.