Political Crime Case: అప్పట్లో కర్ణాటక రాష్ట్రంలో ఓ ముఖ్యమంత్రి (లీగల్ ఇబ్బందుల వల్ల పేరు ప్రస్తావించలేకపోతున్నాం) ఉండేవారు. ఆయన మంత్రివర్గంలో ఓ మహిళా మంత్రి ఉండేవారు. ముఖ్యమంత్రికి, ఆమెకు దగ్గర సంబంధం ఉండేదని అప్పట్లో ప్రచారం జరిగేది. అది ప్రచారం మాత్రమే కాదని నిజమని ఓ వీడియో ద్వారా బయటపడింది. దీంతో ఆ ముఖ్యమంత్రి తలవంచుకోవాల్సి వచ్చింది. పదవిలో ఉన్నన్ని రోజులు నరకం చూడాల్సి వచ్చింది. చివరికి తన పదవి కాలం ముగిసిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా చేయలేదు.
వాస్తవానికి రాజకీయాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరుని సమాజం అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటుంది. దీనికి తోడు ప్రతిపక్షాలు లేదా వైరి పక్షాలు నిత్యం కాచుకుని ఉంటాయి. ఎక్కడ దొరుకుతారా అంటూ ఎదురు చూస్తుంటాయి. బలహీనమైన క్షణంలో చేసిన తప్పుగనక వీడియోల రూపంలో ఆ వ్యక్తుల చేతికి వెళితే ఇక చెప్పడానికి ఏమీ ఉండదు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అనేది అత్యంత బలంగా ఉంది కాబట్టి అప్పటిదాకా ఒక వెలుగు వెలిగిన రాజకీయ నాయకులు ఒక బలహీనమైన క్షణాల్లో చేసిన తప్పు వారి జీవితాన్ని తలకిందులు చేయవచ్చు. తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి తప్పులు చేసి తమ జీవితాలను కోల్పోయిన రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు.
Also Read: సదానందన్ మాస్టారు కి రాజ్యసభ సీటు కేరళ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం
ఇక ఇప్పటి సోషల్ మీడియా కాలంలో కొంతమంది రాజకీయ నాయకులు తాము చేసిన తప్పుల వల్ల తమ పొలిటికల్ లైఫ్ నే కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంచార్జి కోటా వినూత తన వద్ద గతంలో పనిచేసిన మాజీ డ్రైవర్ ను అంతం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినూత పేరును శ్రీనివాసరాయుడు తన చేతి మీద పచ్చబొట్టు పొడిగించుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ పచ్చబొట్టు ఆధారంగానే చెన్నై పోలీసులు శ్రీనివాసరాయుడు కేసులో కీలక పురోగతి సాధించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోటా వినూత చేసిన తప్పు వల్ల ఆమె రాజకీయ జీవితమే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది..
Also Read: Swarna Andhra Vision 2047: బ్రాండ్ చంద్రబాబు నాయుడు రాజకీయ స్థిరత్వాన్ని తెస్తుందా?
గతంలో వైసిపిలో ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా దివ్వెల మాధురితో ఏర్పరచుకున్న సంబంధం వల్ల అభాసుపాలయ్యారు. ఆయన చేస్తున్న వ్యవహారాల వల్ల కుటుంబ సభ్యులు ఈసడించుకున్నారు. గొడవ కూడా పడ్డారు.. చివరికి దువ్వాడ శ్రీనివాస్ వారి మీద గొడవ కూడా దిగారు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పంచాయతీ జరగడంతో శ్రీనివాస్ రాజకీయ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఇటీవల ఆయన కొనసాగుతున్న పార్టీ నుంచి సస్పెండ్ కావలసి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆయన రాజకీయ జీవితం నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. ఎప్పుడు ఎటువంటి మలుపు తీసుకుంటుందో తెలియడం లేదు..కోటా వినూత, దువ్వాడ శ్రీనివాస్ మాత్రమే కాదు.. ఇంకా చాలామంది రాజకీయ నాయకులు ఇటువంటి తెరచాటు బంధాల వల్ల తమ పొలిటికల్ లైఫ్ కోల్పోయారు. నాయకుల తెరచాటు సంబంధాలను వారి దగ్గర వ్యక్తులే బయటికి తెలిసేలా చేయడం విశేషం. ఆ వ్యవహారాలను వివిధ రూపాలలో ప్రత్యర్థులు బయట పెట్టడం గమనార్హం.