Telangana Liquor Sales: తెలంగాణ.. మధ్యం అమ్మకాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం. ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాత అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఇందుకోసం గత ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేసింది. పండుగల వేళల్లో మద్యం అమ్మకాలు పెరిగేలా ఘనంగా ఉత్సవాలు జరగాలని పిలుపు నివ్వడంతోపాటు అమ్మకాల సమయం పొడిగించేది. దీంతో నూనూగు మీసాల కుర్రాడు నుంచి పండు ముసలి వరకు మద్యానికి అలవాటు పడ్డారు. శుభకార్యమైనా.. బాధాకరమైనా.. ఫ్రెండ్స్ కలిసినా.. బంధువులు వచ్చినా.. సెలవులు వచ్చినా మందు తాగాలి అనే భావన పెరిగింది. దీంతో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతూ మద్యం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మంచి ఆదాయ వనరుగా మారింది. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు మందుబాబులకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మద్యం ధరలు పెంచింది. తాజాగా పగలు కూడా డ్రంక్‌అండ్‌డ్రైవ్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మింట్ కాంపౌండ్‌లో జరిగిన స్పెషల్ డ్రైవ్‌లో ఈ విషయం వెల్లడైంది. ఈమధ్య కొందరు స్కూల్ బస్సు డ్రైవర్లు పగటిపూట మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించడంతో ఈ చర్య తీసుకున్నారు.
పగలు ఎందుకంటే…
పగటిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా ఈ తనిఖీల ద్వారా రెండు ప్రయోజనాలు సాధ్యమవుతాయని పోలీసులు భావిస్తున్నారు. మొదటిది, మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి, ముఖ్యంగా స్కూల్ పిల్లల భద్రత పెరుగుతుంది. రెండవది, ఈ తనిఖీల్లో దొరికిన వారిపై విధించే జరిమానాల ద్వారా రాష్ట్ర ఖజానాకు గణనీయమైన ఆదాయం వస్తుంది. జూలై 4–5 తేదీల్లో హైదరాబాద్‌లో 105 మంది మందుబాబులపై రూ. 2.39 లక్షల జరిమానా విధించగా, 17 మందికి జైలు శిక్ష కూడా పడింది.
Also Read: Tesla Cybertruck Features: రూ.కోటి 30 లక్షల సైబర్ ట్రక్.. ఇందులో అంత స్పెషల్ ఏముంది?
సైబరాబాద్‌లో భారీగా అరెస్టులు..
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారాంతంలో నిర్వహించిన తనిఖీల్లో 528 మందిని మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుకున్నారు. వీరిలో 391 మంది టూ–వీలర్ డ్రైవర్లు, 113 మంది ఫోర్–వీలర్ డ్రైవర్లు ఉన్నారు. ఆర్సీపురం ప్రాంతంలో అత్యధికంగా 94 కేసులు నమోదయ్యాయి. ప్రమాదాలకు కారణమైన వారిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు, ఇందులో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటాయి.