Swarna Andhra Vision 2047: నిన్న సీఐఐ సమావేశం.. స్వర్ణాంధ్ర ప్రదేశ్ 2047 టాస్క్ ఫోర్స్ విడుదల సందర్భంగా నిర్వహించారు. టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి మోస్ట్ ప్రామిసింగ్ గా ఉంది. ఎకనమిక్ డెవలప్ మెంట్ విషయంలో చంద్రబాబు విజనరీ.. దానిలో ఎవరికీ సందేహం లేదు. కాకపోతే సమస్యల్లా.. ఇదే రాజకీయ స్థిరత్వంలో అప్లై అవుతుందా? అంటే కానీ బహుతక్కువగా కనిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ దిగి చంద్రబాబు సీఎంగా అయిన 1995లో గద్దెనెక్కారు. నాలుగేళ్లు 1999 వరకూ ఉండి తిరిగి అధికారంలోకి వచ్చారు. 2004 తర్వాత పదేళ్లు అధికారం లేదు. 2014లో సీఎం అయ్యారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. ఎకనమిక్ డెవలప్ మెంట్ విషయంలో చంద్రబాబు విజనరీగా ఉన్నారో.. పాలిటిక్స్ లో ఆ ట్రాక్ రికార్డ్ కనిపించడం లేదు.
రాజకీయాలు వేరు.. ఆర్థిక రంగం వేరు.. 1999 నుంచి 2004 వరకూ వాజ్ పేయి చాలా సంస్కరణలు తెచ్చి బాగా పాలించి కూడా ఓడిపోయారు. చంద్రబాబుకు తెలుసు కాబట్టే ఒంటరిగా వెళ్లలేదు. కొన్ని సార్లు సక్సెస్ అయ్యారు. మరికొన్ని సార్లు సక్సెస్ కాలేదు.
ఆర్థిక సంస్కరణల వాదిగా బాబు గెలిచినా.. పొలిటికల్ గా ఫెయిల్ అయ్యారు. మోడీ మాత్రం రెండింటిలోనూ గెలిచారు. మూడోసారి మెజార్టీ తగ్గింది.
బ్రాండ్ చంద్రబాబు రాజకీయ స్థిరత్వాన్ని తెస్తుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.