PM Modi: అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమానికి హాజరయ్యారు. అమరావతి పనుల పున ప్రారంభంతో పాటుగా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. జాతికి అంకితం చేశారు. ఏడు జాతీయ రహదారులతో పాటు రైల్వే పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇప్పటికే పూర్తయిన తొమ్మిది నేషనల్ హైవేస్, రైల్వే ప్రాజెక్టులను సైతం జాతికి అంకితం చేశారు. నాగాయలంక క్షిపణి ప్రయోగ కేంద్రం, విశాఖలో యాక్టర్ మాల్ కు సైతం శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ఇప్పుడు అమరావతి టూర్ సక్సెస్ కావడంతో ప్రధాని ఆసక్తికర ట్వీట్ చేశారు.
Also Read: జగన్ కంటే బెటర్.. ప్రధానిని ఇచ్చి పడేసిన షర్మిల!
* మరోసారి పొగుడుతూ..
నిన్ననే ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) గురించి ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ ఇద్దరు నేతల మధ్య రాజకీయ కారణాలతో ఎడబాటు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ నిన్నటి సభలో మాత్రం చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు ప్రధాని మోదీ. ఈరోజు తాజాగా చేసిన ట్వీట్ లో సైతం అదే రకమైన ప్రస్తావనలు తీసుకొచ్చారు.’ అమరావతి అభివృద్ధిలో నూతన, చారిత్రాత్మక అధ్యాయాన్ని ప్రారంభించిన సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ నా సోదర, సోదరీమణుల మధ్య ఉండడం ఆనందంగా ఉంది. అమరావతి భవిష్యత్తు పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని.. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పధాన్ని మెరుగుపరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. నాకు మంచి మిత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అమరావతి పట్ల ఉన్న దార్శనికత, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను నేను అభినందిస్తున్నాను’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* కీలక ప్రసంగం..
నిన్ననే సభలో కీలక ప్రసంగం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi). ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అమరావతి ఒక ముఖ్యమైన నగరంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ఐటి, ఏ వన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు. మరో మూడేళ్లలో అమరావతిని చంద్రబాబు పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. ఆ ఆహ్వానం వరకు విశాఖలో జరిగే యోగ డేకు వచ్చేందుకు ప్రధాని సమ్మతించారు. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా యోగ దినోత్సవం జరుపుదామని కూడా ప్రధాని పిలుపునిచ్చారు.
The NDA government will make Amaravati a world class urban centre. pic.twitter.com/o9x2fGzIg6
— Narendra Modi (@narendramodi) May 2, 2025
* రహస్యం చెప్పిన మోడీ..
చంద్రబాబు విషయంలో మరో కితాబు ఇచ్చారు ప్రధాని మోదీ. చంద్రబాబు తనను టెక్నాలజీ విషయంలో పొగుడుతున్నారని.. కానీ ఆయన నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. అందరికీ ఓ రహస్యం చెబుతాను.. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో.. చంద్రబాబు హైదరాబాద్ లో ఐటీ ని ఎలా అభివృద్ధి చేస్తున్నారో గమనించాను. ఆయన ద్వారా ఎన్నో తెలుసుకున్నాను. అధికారులను కూడా పంపించాను. ఆరోజు తెలుసుకున్న వాటిని ఇప్పుడు అమలు చేసే అవకాశం లభించింది అంటూ ప్రధాని నిన్ననే సభలో ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నా స్నేహితుడు అంటూ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: సాక్షిలో కనిపించని అమరావతి ప్రకటనలు!