Toyota : సొంత కారు ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఎలాంటి కారు తీసుకోవాలని చాలామందికి సందేహం ఉంటుంది. కొందరు చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా కారు కొనుగోలు చేస్తే.. మరి కొందరు పెద్ద ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే వెహికల్ కొనుగోలు చేస్తారు. ఇలాంటి వారి కోసం కంపెనీలో సైతం ప్రత్యేకంగా వాహనాలను తయారు చేసి మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటాయి. ఇటీవల ఎక్కువగా మార్కెట్లో సెవెన్ సీటర్ కార్లు ఆకర్షిస్తున్నాయి. అయితే తాజాగా టయోటా కంపెనీ కి చెందిన ఓ కారులో 8 మంది సురక్షితంగా ప్రయాణించవచ్చు.అయితే ప్రత్యేక ఎడిషన్ లో రిలీజ్ చేసిన ఈ కారు 2025 జూలై వరకు మాత్రమే విక్రయిస్తారు. అతి తక్కువ సేల్స్ చేసే ఈ కారు గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..
వాహనాల తయారీలో దేశంలో దిగ్గజ కంపెనీలో ఒకటైన టయోటా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ కంపెనీ సెవెన్ సీటర్ కార్లకు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రాస్ ప్రత్యేక ఎడిషన్ను తాజాగా రిలీజ్ చేశారు. ప్రీమియం డిజైన్ లుక్కుతోపాటు.. ఆకర్షణీయమైన ఫీచర్లో ఉన్న దీనిని పరిమిత సేల్స్ గా నిర్ణయించారు.
Also Read : కియా సోనెట్ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఏప్రిల్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు!
ఈ మోడల్ కేవలం విలాసవంతమైన కారు మాత్రమే కాకుండా ఇందులో సౌకర్యవంతమైన ఫీచర్లు.. ఇంజన్ వ్యవస్థ ఉంది. ఇన్నోవా ఐక్రాస్ ఎక్స్క్లూసివ్ ఎడిషన్ లో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ యూనిట్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 186 బిహెచ్పి శక్తిని, 206 ఎంఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ ECVT ట్రాన్స్మిషన్ తో పనిచేసే ఈ కారులో డ్రైవ్ చేస్తే కొత్త అనుభూతి కలుగుతుంది. ఈ ఇంజన్ లీడర్ ఇంధనానికి 23.24 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. మిగతా కార్ల లాగే ఇందులో ప్రీమియం ఫీచర్లు ఉంటాయి.
ఈ కారులో డ్యూయల్ జీవన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ sunroof టీచర్ తో ఆకట్టుకుంటుంది. అలాగే ఇందులో లగ్జరీ ఫీచర్లు కూడా ఉన్నాయి. రెండో వరుసలో పవర్ టు మంత్ సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి. ఇక సేఫ్టీ కోసం ఇందులో అడ్రస్ షూట్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం కార్లు కొనాలని అనుకునేవారు ఇది సౌకర్యవంతంగా ఉంటుందని అంటున్నారు.
అయితే ఈ కారు 2025 జూలై వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఇది కనిపించదు. ప్రస్తుతం దీనిని మార్కెట్లో రూ. 32.58 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. పెద్ద ఫ్యామిలీ సురక్షితంగా దూర ప్రయాణాలు చేసేందుకు అనుకూలంగా ఉండే ఈ కారు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కార్యాలయాల్లో పనిచేసే వారు విలాసవంతమైన కారు కొనాలని అనుకునే వారికి కూడా బాగుంటుంది అని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. టయోటా నుంచి వచ్చిన ఇన్నోవా ఇప్పటికే ఎంతోమంది వినియోగదారులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ప్రత్యేక ఎడిషన్ కూడా ఎక్కువ సేల్స్ నమోదు చేస్తుందని ఆశిస్తున్నారు.
Also Read : టాటా, మహీంద్రాకు పోటీ.. టయోటా ఇన్నోవా హైక్రాస్ స్పెషల్ ఎడిషన్