PM Awas Yojana Gramin 2.0 Beneficiary List AP ఏపీ( Andhra Pradesh) ప్రజలకు గుడ్ న్యూస్. సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయనుంది. ఏప్రిల్ లో ఈ పథకం అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. గత డిసెంబర్ వరకు దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది తమ గృహ అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అధికారులు పరిశీలన పూర్తి చేశారు. ఏప్రిల్ లో లబ్ధిదారుల జాబితాను విడుదల చేయనున్నారు. మంజూరు పత్రాలు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
* రాష్ట్రవ్యాప్తంగా 10.42 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో 8.29 లక్షల మంది తమకు స్థలం ఉన్నప్పటికీ ఇళ్లు నిర్మించేందుకు సాయం కోరారు.
* మరో 2.13 లక్షల మంది స్థలంతో పాటు ఇల్లు రెండింటికీ దరఖాస్తు చేసుకున్నారు.
* దరఖాస్తుదారుల్లో 1.43 లక్షల మంది ఎస్టీలు, 2.16 లక్షల మంది ఎస్సీలు, 4965 మంది దివ్యాంగులు, 6.92 లక్షల మంది ఇతర వర్గాలకు చెందిన వారు ఉన్నారు.
* ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించింది. ఆమోదం కోసం కేంద్రానికి పంపించింది. మార్చి 3 వరకు కేంద్ర ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించనుంది. అయితే ఇందులో 60 వేల దరఖాస్తులను కేంద్రం తిరస్కరించినట్లు సమాచారం. కేంద్రం నుంచి ఆమోదం లభించిన తర్వాత అర్హుల జాబితాను ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
* ఎవరైతే ఇంటి స్థలం లేదని దరఖాస్తు చేసుకున్నారో.. వారికి మూడు సెంట్లు స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇంటి నిర్మాణానికి సాయం చేయనుంది.
* అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 77353 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత స్థానంలో శ్రీకాకుళం జిల్లా ఉంది. 75,117 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 7433 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
PM Awas Yojana Gramin 2.0 Beneficiary List AP: ఏపీలో వారికి కొత్త ఇళ్లు.. జాబితాలు రెడీ!
Related News
Most Popular
Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే
Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...
Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...
Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..
Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...
OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..
Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...