YS Jagan Vs Police : బట్టలూడదీసి నిలబెడతాం అంటూ ఏపీ పోలీసులను ఉద్దేశించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy )హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి దీనిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తెగ రచ్చ చేస్తోంది. పెద్ద ఎత్తున వైరల్ చేస్తోంది. పోలీసులంతా విలన్లు అయినట్టు.. వైసిపి అనుకూల మీడియా, సోషల్ మీడియా విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో షాక్ ఇచ్చారు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్. ఊడదీయడానికి ఇది అరటి తొక్క కాదు అంటూ సింపుల్ గా తేల్చి పారేశారు. మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత సైతం స్పందించారు. క్రిమినల్ కు అలాంటి ఆలోచనలు తప్ప మరేంటి వస్తాయని ప్రశ్నించారు. తాజాగా పోలీస్ అధికారుల సంఘం జగన్ వ్యాఖ్యలను తప్పు పట్టింది.
Also Read : బట్టలూడదీస్తావా? జగన్ జాగ్రత్తగా మాట్లాడు.. ఎస్ఐ మాస్ వార్నింగ్!
* పోలీస్ సంఘం నుంచి అభ్యంతరాలు..
ఒక పోలీస్ అధికారిని బట్టలూడదీసి నిలబెడతామని ఒక మాజీ సీఎం అనడం దారుణమని పోలీస్ అధికారుల సంఘం( Police officers Union ) రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. జగన్ వ్యాఖ్యలపై సభ్య సమాజం ఆలోచించుకోవాలన్నారు. బట్టలూడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షో నా? అని కౌంటర్ ఇచ్చారు. పోలీసు ఉద్యోగం తీవ్రమైన ఒత్తిడితో కూడుకొని ఉంటుందని.. ప్రతినిత్యం ఒత్తిడితో ఉద్యోగాలు చేస్తున్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జగన్ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఏపీ పోలీసులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే మాత్రం న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పారు ఏపీ పోలీస్ అధికారుల సంఘం నేతలు.
*మహిళా ప్రతినిధి సీరియస్
మరోవైపు ఏపీ పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధి భవాని( Bhavani ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బట్టలూడదీస్తావా అంటూ ప్రశ్నించారు. పోలీస్ ఉద్యోగుల్లో మహిళలు కూడా ఉన్నారనే విషయాన్ని మరిచిపోయారా జగన్ అంటూ నిలదీసినంత పని చేశారు. జగన్ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసాయన్నారు. పోలీసులంటే ఆయనకు గౌరవం లేదని అర్థమవుతోందని.. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం భవాని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసుల నుంచి మాత్రం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
* ఎస్పీ పరోక్ష స్పందన..
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) కామెంట్స్ పై శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్న పరోక్షంగా స్పందించారు. నేరుగా ఆయన వ్యాఖ్యలపై స్పందించను అంటూనే కౌంటర్ ఇచ్చారు. పోలీస్ యూనిఫామ్ తాము కష్టపడి సాధించుకున్నదని.. అది ఎవరో తమకు ఇచ్చింది కాదన్నారు. ఒకవేళ పోలీసులు ఎవరైనా తప్పు చేసి ఉంటే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అన్నారు. తాము తమ డ్యూటీ మాత్రమే చేశామని.. ఎవరికి అనుకూలంగానో.. వ్యతిరేకం గానో పనిచేయలేదని చెప్పారు.
బట్టలూడదీస్తావా?..కొంచమైన ఇంగిత జ్ఞానం ఉందా నీకు? జగన్ కి మహిళ పోలీస్ స్ట్రాంగ్ కౌంటర్.#HOPEJETTI pic.twitter.com/KGhkSNvGjb
— RENUKA.JETTI.LL.B. (@renuka_jetti) April 9, 2025