Pithapuram Varma comments on Pawan Kalyan : ఎన్నికల ఫలితాల తర్వాత పిఠాపురం( Pithapuram ) నియోజకవర్గం నిత్యం హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో చిన్నపాటి వార్త సైతం పెద్దదిగా కనిపిస్తోంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్చార్జ్ వర్మ చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ప్రజలతో మమేకమై పనిచేస్తారు. అటు కూటమిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న వర్మ కొన్ని విషయాల్లో మాత్రం కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంటారు. తాజాగా ఆయన పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందా విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. వైసిపి హయాంలో ఇసుక దందాకు పాల్పడిన వారే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని.. వారికి ఎవరి అండదండలు ఉన్నాయో తెలియడం లేదని కామెంట్స్ చేశారు పిఠాపురం వర్మ. ఇప్పుడు సోషల్ మీడియాలో అవే హల్చల్ అవుతున్నాయి.
Also Read : చేగువేరా నా హీరో , నేను ఎవ్వరిని బాధపెట్టను…. పవన్ ఎమోషనల్ కామెంట్స్..!
* ఇసుక తవ్వకాల పరిశీలన..
పిఠాపురం నియోజకవర్గంలోని మల్లివారి తోటలో ఇసుక అక్రమ తవ్వకాలను పరిశీలించారు వర్మ( Varma) . అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పోలీసులు మాఫియాతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రమణక్కపేటలో అక్రమ రవాణాకు మరో శంకుస్థాపన చేశారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనుమతులు లేకుండా ఎలా ఇసుక తవ్వకాలు చేస్తున్నారో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఇసుక తవ్వకాలపై టెంట్లు వేసి పోరాటం చేశామని.. ఇప్పుడు అదే వ్యక్తులు ఇసుక దందాకు పాల్పడుతున్నారని.. వీరికి ఎవరు సహాయం చేస్తున్నారు అర్థం కావడం లేదని అనుమానాలు వచ్చేలా మాట్లాడారు. జనసేన పేరు ప్రస్తావించకుండా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
* తెలుగుదేశం పార్టీకి సంబంధంలే..
ఇసుక అక్రమ రవాణాలో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) పాత్ర ఉండదని వర్మ తేల్చేశారు. తెలుగుదేశం నాయకులు ఉంటే జైల్లో పెట్టుకోవాలని సవాల్ చేశారు. కూటమి పార్టీల విషయాన్ని ప్రస్తావిస్తూ.. పిఠాపురంలో ఇసుక దందా విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని చెప్పారు. ఇసుక మాఫియా తో పోలీసులు చేతులు కలిపారని.. ఇక్కడ అక్రమ ఇసుక తవ్వకాల పేరిట పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్నా పట్టించుకోవడంలేదని.. 20 రోజులుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదని వర్మ చెప్పుకొచ్చారు. ఇదే విషయంపై విలేకరులు వర్మను పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయవచ్చు కదా? ఈ ఇసుక దందా ఆయనకు తెలియదా? అని ప్రశ్నించగా వర్మ స్పందించారు. పవన్ కళ్యాణ్ సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని.. ఆయన సైతం తప్పకుండా చర్యలకు ఆదేశిస్తారని చెప్పుకొచ్చారు. అయితే వైసిపి హయాంలో ఇసుక దందాకు పాల్పడుతున్న వారే.. ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని.. ఇందులో టిడిపికి సంబంధం లేదని చెప్పడం ద్వారా కొత్త సందేహాలకు తెర లేపారు వర్మ. మరి దీనిపై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.
పిఠాపురంలో ఇసుక స్మగ్లింగ్ పై వర్మ సీరియస్
బొండు ఇసుక క్వారీని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే వర్మ
రోజూ 200-300 లారీలతో ఇసుక తరలిస్తున్నారని ఫిర్యాదు చెసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణ
పిఠాపురంలో గంజాయి వాడకం ఎక్కువైందన్న వర్మ
ఈ అంశాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపిన… pic.twitter.com/WDFoiHTmWI
— BIG TV Breaking News (@bigtvtelugu) June 7, 2025