Pawan’s Role Model Che Guevara :పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అంత తేలికగా అర్థం అయ్యే వ్యక్తి కాదు, అతని సిద్ధాంతాలు అంత తేలికగా ఎవరికీ ఎక్కవు. కాసేపు కమ్యూనిస్ట్ భావాలు ఉన్నవాడిలా మాట్లాడుతాడు, చేగువేరా అంటాడు, కాసేపు సనాతన ధర్మం అంటాడు, అసలు ఈయన ఒక క్లారిటీ అంటూ లేకుండా రాజకీయాల్లోకి వచ్చాడంటూ పవన్ ని అర్థం చేసుకోని వాళ్ళు అంటూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ భిన్నత్వం లో ఏకత్వాన్ని వెతికే మనిషి. మొదటి నుండి ఆయన ఇదే భావాలతో బ్రతికాడు. రాజకీయాల్లోకి రాకముందు కూడా ఆయన ఇలాంటి మార్గం లోనే నడిచాడు. గొప్పవాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ దారిలో వెళ్తే న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. నేను అలాంటి వారిలో మంచి లక్షణాలను తీసుకొని ముందుకు వెళ్తానే తప్ప, నేను ఎప్పుడూ కూడా పూర్తిగా లెఫ్ట్ సిద్ధాంతాలకు చెందిన వాడిని అని కానీ, లేకపోతే రైట్ సిద్ధాంతఃలను నమ్మేవాడిని అని కానీ చెప్పుకోలేదు అని అంటూ ఉంటాడు పవన్ కళ్యాణ్.
Also Read : హరి హర వీరమల్లు’ స్థానంలో ‘తొలిప్రేమ’..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!
ఇప్పుడే కాదు, ఆయన కొమరం పులి సినిమా షూటింగ్ సమయం లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తల్లో పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సమయంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ లో యువరాజ్యం విభాగానికి అధ్యక్షుడిగా ఉండేవాడు. ఇదంతా పక్కన పెట్టి ఈ ఇంటర్వ్యూ ని ఒక్కసారి పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ లో అప్పటికీ ఇప్పటికీ ఇసుమంత మార్పు కూడా రాలేదని అర్థం అవుతుంది. అప్పట్లో ఆయన మాట్లాడుతూ ‘బడుగు బలహీన వర్గాలే నా ఊపిరి. వాళ్ళ కోసం నిరంతరం తపించే మనసు నాది. చేగువేరా(Che Guevara) అందుకు నాలో గొప్ప స్ఫూర్తిని నింపాడు. ఆయన నా రియల్ హీరో’ అంటూ చెప్పుకొచ్చాడు. అప్పట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలను అధికారం లోకి వచ్చిన తర్వాత నిజం చేస్తూ బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన వ్యవహార శైలి ని దేశం మొత్తం మెచ్చుకుంటూ ఉండడం మనమంతా చూస్తూనే ఉన్నాం.

అదే విధంగా అప్పట్లో ఆయన నిర్మాతల పట్ల మాట్లాడిన కొన్ని మాటలు, ఇప్పుడు ఆచరణలో చేస్తున్న ఘటనలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ లో ఏ మార్పు లేదని తెలుస్తుంది. అప్పట్లో ఆయన మాట్లాడుతూ ‘ఎవరినీ ఇబ్బంది పెట్టే మనస్తత్వం నాది కాదు. అది నిర్మాతని అయినా, డైరెక్టర్ అయినా. ఎన్నో సార్లు నా సినిమాలు ఫ్లాప్ అయ్యినప్పుడు నిర్మాతలను, బయ్యర్స్ ని ఇంటికి పిలిచి నేను తీసుకున్న రెమ్యూనరేషన్ ని తిరిగి ఇచ్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే నిర్మాత బాగుంటేనే సినీ ఇండస్ట్రీ బాగుంటుంది. మేమంతా సంతోషంగా ఉంటాము, వేల మందికి పని దొరుకుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా ‘హరి హర వీరమల్లు’ చిత్ర నిర్మాతకు ఆర్ధిక ఇబ్బందులు ఉంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికీ ఇప్పటికీ పవన్ తీరులో ఎలాంటి మార్పు లేదు అనేందుకు ఇది ఒక ఉదాహరణ.