Homeఆంధ్రప్రదేశ్‌Peddireddy Ramachandra Reddy YSRCP Exit News: వైసీపీకి ఆ బలమైన ఫ్యామిలీ గుడ్ బై?!

Peddireddy Ramachandra Reddy YSRCP Exit News: వైసీపీకి ఆ బలమైన ఫ్యామిలీ గుడ్ బై?!

Peddireddy Ramachandra Reddy YSRCP Exit News:  వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి ఒక బలమైన లీడర్ గుడ్ బై చెబుతారా? వ్యూహాత్మకంగా సైలెన్స్ పాటిస్తున్నారా? అధినేత వైఖరి నచ్చడం లేదా? లేకుంటే కూటమి ప్రభుత్వం దూకుడు కారణమా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఎవరో నేత అంటే చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొన్నటి కూటమి ప్రభంజనాన్ని కూడా తట్టుకున్నారు. తాను ఒక్కడిని గెలవడమే కాదు తన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ని తంబళ్లపల్లె నుంచి గెలిపించుకున్నారు. కుమారుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి రాజంపేట ఎంపీ గాను గెలిచారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

* వైఎస్ కుటుంబ సన్నిహితుడు..
వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ( y s Rajasekhar Reddy ) అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ సాన్నిహిత్యం తోనే జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు పెద్దిరెడ్డి. గత దశాబ్ద కాలంగా బలమైన, తిరుగులేని నేతగా ఎదిగారు. పార్టీ తరఫున రాయలసీమ బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అప్పగించారు. అయితే వైసిపి అధికారంలో ఉన్నప్పుడు దూకుడు ప్రదర్శించిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు క్రమేపి పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటుంది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ కుటుంబం రాజీనామా చేయబోతోందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభం అయింది. ప్రస్తుతం ఆ ఫ్యామిలీ ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలు చూస్తుంటే మాత్రం పార్టీ మారుతారని బలమైన ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి ఫ్యామిలీతో పాటు వారి అనుచరుల వ్యాపారాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలో పెద్దిరెడ్డి మాటే శాసనం అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది.

* కూటమి వైపా?..
మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ( Mithun Reddy)అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో సుదీర్ఘకాలం రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అటు తర్వాత పెద్దిరెడ్డి పై సైతం అనేక కేసులు తెరపైకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో దూకుడు కంటే మౌనం పాటించడమే మేలన్న నిర్ణయానికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పిలుపు ఇచ్చిన కార్యక్రమాలను సైతం నిర్వహించలేని పరిస్థితి ఆ ఫ్యామిలీది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో జగన్ సైతం ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని వెతుక్కుంటున్నట్లు సమాచారం. అందుకే పెద్దిరెడ్డి తన దారి తాను చూసుకునే పనిలో ఉన్నారని లీకులు బయటకు వస్తున్నాయి. సాధారణంగా పెద్దిరెడ్డి లాంటి సీనియర్ నేత బయటకు వెళ్లిపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం. కోలుకోలేని దెబ్బ కూడా. అయితే తనపై ఉన్న కేసుల ఒత్తిడి, వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా.. పెద్దిరెడ్డి కూటమి వైపు వెళ్తారా? లేకుంటే స్వతంత్రంగా వ్యవహరిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు అనేది చిత్తూరు జిల్లా పొలిటికల్ వర్గాల్లో బలమైన చర్చ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version