Homeఆంధ్రప్రదేశ్‌Deputy CM Pavan Kalyan : పవన్ హోం మంత్రి పదవి తీసుకోలేదు ఎందుకు? సోదరుడు...

Deputy CM Pavan Kalyan : పవన్ హోం మంత్రి పదవి తీసుకోలేదు ఎందుకు? సోదరుడు చిరంజీవి కారణమా?

Deputy CM Pavan Kalyan : ఎన్నో విషయాల్లో తనకు ప్రేరణ మెగాస్టార్ చిరంజీవి అని ఆయన సోదరుడు పవన్ చెబుతుంటారు.చిరంజీవిలో ఉన్న దాన గుణాన్ని తాజాగా ప్రస్తావించారు పవన్. చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపే క్రమంలో తన మదిలో ఉన్న భావాన్ని తెలియజేశారు. తన సోదరుడి గొప్పతనాన్ని బయటపెట్టారు. అయితే ప్రస్తుతం తాను నిర్వర్తిస్తున్న మంత్రి పదవులకు ప్రేరణ కూడా సోదరుడు చిరంజీవి అని గుర్తు చేసుకున్నారు పవన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ దూకుడుగా వ్యవహరించేవారు. సమకాలీన అంశాలపై గట్టిగానే మాట్లాడేవారు. వైసిపి హయాంలో అన్యాయాలు,అక్రమాలు జరిగినప్పుడు నిలదీసి అడిగే వారు. మహిళల అదృశ్యంపై ప్రస్తావించారు కూడా.అయితే జనసేన భాగస్వామ్యంతో పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కువమంది పవన్ సీఎం కావాలని ఆకాంక్షించారు. లేకుంటే హోంమంత్రి పదవి అయినా తీసుకోవాలని సూచించారు. సీఎం తర్వాత అంతటి శక్తివంతమైన పదవి కావడంతో.. ఎక్కువమంది హోంమంత్రి పదవి తీసుకోవాలని భావించారు. కానీ పవన్ మాత్రం తనకి ఇష్టమైన గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్,పర్యావరణ, అటవీ శాఖలను తీసుకున్నారు. తనకు ఆ శాఖలే ఇష్టమని చెప్పుకొచ్చారు.

* విప్లవాత్మక మార్పులకు నాంది
పంచాయితీరాజ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పంచాయతీలకు విధులు, నిధులు తప్పనిసరి అని తేల్చేశారు. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు.ప్రజలకు అవసరమైన పనులను గుర్తించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు.వాటి తీర్మానాలు రూపొందించారు.

* అందుకే ఆ శాఖ తీసుకోలేదు
అయితే ఈ క్రమంలో తాను ఎందుకు హోంమంత్రి పదవి తీసుకోలేదో సభలో వివరించే ప్రయత్నం చేశారు. తనకు చిన్ననాటి నుంచి అన్నా హజారే అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఎక్కడో మిలటరీలో పనిచేసి.. మహారాష్ట్రలోని ఓ గ్రామానికి వచ్చి..అక్కడున్న పరిస్థితులు చూసి.. అదే గ్రామానికి సర్పంచ్ అయ్యారని అన్నా హజారే గురించి తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించవచ్చు చేసి చూపించిన యోధుడు అన్న హజారే అంటూ వివరించే ప్రయత్నం చేశారు. అందుకే ఆయనంటే తనకు చాలా అభిమానం అన్నారు. ఆయన కథ ఇతివృత్తంగా రుద్రవీణ సినిమా అని గుర్తు చేశారు పవన్.చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షక ఆదరణ పొందింది.

* అన్న హజారే ఆదర్శం
గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకమని.. ఓ సర్పంచ్ తలచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందని నిరూపించిన మహోన్నత యోధుడు అన్న హజారే అని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. లోక్ పాల్ బిల్లుతో పాటు సమాచార హక్కు చట్టం వ్యవస్థాపకుడు కూడా ఆయనేనని… అటువంటి వ్యక్తి స్ఫూర్తితోనే తాను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు. మొత్తానికైతే తాను హోం మంత్రి పదవి తీసుకోకుండా.. గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు తీసుకోవడానికి సోదరుడు చిరంజీవి ప్రేరణ అని పవన్ పరోక్షంగా చెప్పుకొచ్చారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular