Pawan Kalyan War: సనాతన ధర్మ పరిరక్షణ కోసం మరోసారి రంగంలోకి దిగారు పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan). ఈసారి ఆయన ఇండియా కూటమిని టార్గెట్ చేశారు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ పరిణామం పై మాట్లాడారు. హిందూ మత సంప్రదాయాలను గౌరవిస్తూ తీర్పు ఇచ్చిన ఓ న్యాయమూర్తి పై అభిశంసన ఏమిటని ప్రశ్నించారు. ఇదేం సెక్యులరిజం అంటూ నిలదీసినంత పని చేశారు. గత కొంతకాలంగా హిందుత్వవాదంతో పాటు సమైక్యత భావాలను గట్టిగానే వినిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. అక్కడ డీఎంకే అనుసరిస్తున్న అంశాలను గట్టిగానే నిలదీస్తున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటించిన సంగతి తెలిసిందే. గొప్ప ఆధ్యాత్మిక ప్రసంగం కూడా అక్కడ చేశారు. ఇప్పుడు మరోసారి హిందుత్వ వాదానికి మద్దతుగా గట్టిగానే మాట్లాడారు పవన్ కళ్యాణ్.
హిందువులకు అనుకూల తీర్పు ఇచ్చారని.. తమిళనాడులో( Tamil Nadu ) ఓ కొండపై హిందూ ఆలయానికి సంబంధించి.. అక్కడ అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని జఠిలం చేశారు. దర్గా కమిటీతో వివాదం కోర్టు వరకు దారితీసింది. ఓ కొండపై కార్తీక దీపం వెలిగించే క్రమంలో ఈ వివాదం రేగింది. అయితే పరిమిత సంఖ్యలో జనం వెళ్లి కార్తీకదీపం వెలిగించుకోవచ్చని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఆ ఏర్పాట్లు చేయాలని వచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదు డీఎంకే ప్రభుత్వం. మరోవైపు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి పై అవిశంసనకు డీఎంకే డిమాండ్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇంకోవైపు ఇండియా కూటమినేతృత్వంలో ఓ 120 మంది ఎంపీలు స్పీకర్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్. హిందూమత ఆచారాలను, సంప్రదాయాలను గౌరవిస్తూ తీర్పు చెప్పడం తప్ప అంటూ నిలదీశారు. ఇదేం సెక్యులరిజం అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్. గతంలో శబరిమలై అయ్యప్ప స్వామి విషయంలో వచ్చిన ఆదేశాల గురించి ఎందుకు పట్టించుకోలేదంటూ ప్రశ్నించారు పవన్.
మరోసారి సనాతన ధర్మంపై..
పవన్ మరోసారి సనాతన ధర్మ పరిరక్షణ కోసం గట్టిగానే మాట్లాడే అవకాశం ఉంది. తిరుమల లడ్డు వివాదం, తదనంతర పరిణామాల క్రమంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రధానంగా తమిళనాడు నుంచి అభ్యంతరాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ సైతం వెనక్కి తగ్గలేదు. అప్పటినుంచి తమిళనాడు పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆ రాష్ట్రంలో తరచూ ఆలయాలను సందర్శిస్తున్నారు. హిందూ మతాలకు సంబంధించి, మఠాధిపతుల నుంచి వస్తున్న ఆహ్వానం మేరకు తరచూ అక్కడకు వెళ్తున్నారు. హిందూ మతానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని ఏకంగా న్యాయమూర్తి పై వేటు వేయాలనుకుంటున్న ప్రయత్నాన్ని గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు పవన్. ఇప్పటివరకు ఆయన సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాత్రమే మాట్లాడారు. ఇప్పుడు ఇండియా కూటమికి నేరుగా హెచ్చరికలు పంపారు. పవన్ ప్రకటనపై ఇండియా కూటమి ఎలా స్పందిస్తుందో చూడాలి.