Star Heroes: సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ప్రేక్షకులు సైతం వాళ్ళ సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తారు. కారణం ఏంటంటే భారీ విజువల్స్ తో కూడిన సినిమాలు వాళ్లు మాత్రమే చేయగలరు. కాబట్టి వాళ్ళ సినిమాలను చూసినప్పుడు ప్రేక్షకులు తెలియని ఒక ఆనందానికి గురవుతారు. రెండున్నర గంటలపాటు తన బాధల్ని మర్చిపోయి ఆ సినిమాలో లీనమైపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అందుకే స్టార్ హీరోల సినిమాకి ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది… ఇప్పటివరకు స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలు ఒకెత్తయితే, చిన్న హీరోలు చేస్తున్న సినిమాలు మరొక ఎత్తుగా మారుతున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోలు కూడా పోటీ పడి మంచి సినిమాలను చేసి స్టార్ హీరోల రేంజ్ కి వెళ్ళారు. కానీ ఇప్పుడున్న చిన్న హీరోలు స్టార్ హీరోల రేంజ్ ను అందుకోకపోవడానికి కారణం ప్రస్తుతం స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న వారే అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు.
కారణం ఏంటంటే ఒకప్పుడు అందరి హీరోల సినిమాలను 20 రూపాయల బాల్కనీ టికెట్ తో చూశారు. ఇప్పుడు ప్రతి హీరో తమ బడ్జెట్ ను బట్టి సినిమా టికెట్ల రేట్లు ఫిక్స్ చేసుకుంటున్నారు. ఒక హీరోకి 500 రూపాయల టిక్కెట్ రేట్ ఉంటే మరొక హీరోకి 1000, 2000, 3000 వరకు కూడా సినిమా టిక్కెట్ రేట్లు ఉంటున్నాయి.
దాని వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్లు తమ ఫ్యామిలీ మొత్తాన్ని సినిమాకు తీసుకెళ్లడానికి 6000 రూపాయల వరకు అవుతోంది. కానీ వాళ్ళు పండగ సీజన్ వచ్చినప్పుడు మాత్రమే తమ దగ్గర ఉన్న డబ్బుల్ని సినిమాకోసం ఖర్చు పెడుతుంటారు. మిగతా సమయంలో చిన్న సినిమాలు వచ్చినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదు.
పెద్ద హీరోలు వాళ్ళ బడ్జెట్ ని పెంచి సినిమా టిక్కెట్ రేట్లను పెంచడం వల్లే చిన్న హీరోల సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోకుండా పోతున్నారు. వాటిని కేవలం ఓటీటీ లో చూసే సినిమాలు గానే వాళ్ళు భావిస్తున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే స్టార్ హీరోల వల్లే చిన్న హీరోల కెరియర్ మీద దెబ్బ పడుతుందని పలువురు చెబుతుండటం విశేషం…