Pawan Kalyan – Vaaraahi : వారాహి కదలబోతోంది. ఏపీ ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగబోతున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో యజ్ఞం చేసిన పవన్ ఈరోజు ప్రచార రథం వారాహికి పూజలు చేశారు. కదం తొక్కుతూ పదం పాడుతూ వారాహి రథం కదనరంగంలోకి కదిలింది.

రెండు రోజుల పాటు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో యాగం చేపట్టిన పవన్ పూర్ణాహుతితో ఈరోజు ముగించారు. అనంతరం ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు చేశారు.

వేద పండితులు పవన్ కళ్యాణ్ గారికి విజయం సిద్ధించాలని ఆశీర్వదించారు. వారాహి రథం నాలుగు వైపులా గుమ్మడికాయలు కొట్టి, నీరు పారబోసి చివరగా వారాహికి హారతినిచ్చి పవన్ కళ్యాణ్ నమస్కరించారు. అనంతరం వారాహి బయలు దేరగా.. దాని ముందే పవన్, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విజయ సంకేతం చూపుతూ నడిచారు.

సో అధికారికంగా ఇక వారాహి కదిలినట్టైంది. ఈ వారాహి మీదనే పవన్ ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. అందుకే వారాహికి పూజలతో ప్రసన్నం చేసుకొని ఏలాంటి అపశకునాలు లేకుండా ఇలా పూజా కార్యక్రమాలు చేపట్టారు.

