Allu Arjun : సోషల్ మీడియా లో అల్లు అర్జున్(Icon Star Allu Arjun) పై నెగెటివిటీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన ఏమి చేసిన ట్రోల్ చేయడానికి నెటిజెన్స్ రెడీ గా ఉంటారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఆయన ఇచ్చే ప్రసంగాలు ఎక్కువగా ట్రోల్స్ కి గురి అవుతుంటాయి. ఏదైనా ట్రోల్ కంటెంట్ ఇచ్చినప్పుడు ట్రోల్స్ రావడం సహజమే, కానీ అల్లు అర్జున్ ఏమి చేసినా ట్రోల్స్ చేసే నెటిజెన్స్ ఉన్నారు. అందుకు లేటెస్ట్ ఉదాహరణ ‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’ టీ షర్ట్ ధరించడమే. ఆయన క్యాజువల్ గానే వేసుకున్నాడు. కానీ దీనిని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఎన్ని విధాలుగా వక్రీకరించాలో, అన్ని విధాలుగా వక్రీకరించారు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కౌంటర్ ఇస్తూ ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ కి ‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’ అని అన్నాడని కామెంట్స్ చేసారు.
Also Read: వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఫిక్స్…క్లారిటీ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్…
మరికొంత మంది అయితే అల్లు అర్జున్ కి అటెన్షన్ పిచ్చి ఎక్కువ, అందులో భాగంగానే ఇలాంటి టీ షర్ట్ వేసాడని అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ఈ టీ షర్ట్ ధరించిన వీడియో లోనే, అల్లు అర్జున్ ఒక అభిమాని సెల్ఫీ అడిగితే నిరాకరించాడు. దీనిపై నెటిజెన్స్ కొంతమంది ఏకిపారేస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానుల గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో చాలా గొప్పగా చెప్తుంటాడు. కానీ అసలు రియాలిటీ ఇది. అభిమానులు లేకపోతే అల్లు అర్జున్ కాదు, ఏ సెలబ్రిటీ కూడా ఇండస్ట్రీ లో ఉండదు, వేల కోట్లు సంపాదించలేరు అంటూ చెప్పుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ అభిమానులు అయితే ప్రతీ దానికి ట్రోల్స్ చేయాల్సిన అవసరం లేదని, అల్లు అర్జున్ ఫ్లైట్ సమయం అయిపోతుందనే తొందరలో వెళ్లి ఉండొచ్చు, లేకపోతే తన బిజీ షెడ్యూల్ వేరే ఏముందో మనకి ఏమి తెలుసు అంటూ చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్ మా అభిమానులను ఎంత అభిమానిస్తాడో మాకు తెలుసునని, ఎవ్వరూ ఈ విషయం లో బాధపడాల్సిన అవసరం లేదని అల్లు అర్జున్ అభిమానులు ట్రోలర్స్ ని తిప్పికొడుతున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా లో ఆయన సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించబోతున్నాడు. అందుకే నిన్న ఆయన స్పెషల్ జిం ట్రైనర్ వద్ద జాయిన్ అయ్యాడు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో విడుదల చేయగా, ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ లుక్ హాలీవుడ్ హీరోలను తలపించే రేంజ్ లో ఉందని ఆయన అభిమానులు ఆ ఫోటోని షేర్ చేస్తూ మురిసిపోతున్నారు. ఈ చిత్రాన్ని మరో రెండు నెలల్లో ప్రారంభించనున్నారు. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, అనన్య పాండే వంటి వారు ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటిస్తున్నారని టాక్.