Pawan Kalyan speech : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఏడాది సమయం పూర్తి అయిన సందర్భంగా సుపరిపాలనకు ‘తొలిఅడుగు’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Minister Lokesh) లతో పాటు కూటమి ఎమ్మెల్యేలు,ఎంపీలు, మంత్రులు,కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సంచలనంగా మారింది. ముందుగా ఆయన ఏడాది కాలం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వం ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అభివృద్ధిని, అదే విధంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించాడు. ఆ తర్వాత తన నేతృత్వం లోని పంచాయతీ రాజ్, పర్వావరణం, అటవీ శాఖల్లో జరిగిన అభివృద్ధి గురించి వివరించాడు. ప్రసంగం చివరి 5 నిమిషాల్లో విపక్ష పార్టీ వైసీపీ పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.
ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ లో ఇంత ఫైర్ ని అభిమానులు చూడలేదు. ఆయన మాట్లాడుతూ ‘గత ప్రభుత్వం తాలూకా మనుషులు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా రౌడీయిజం ని తగ్గించలేదు. గొంతు కోస్తాం అని బెదిరిస్తున్నారు. మీ అరాచక పాలన ని తట్టుకొనే మేము ఇంత దూరం వచ్చాము. మీ తాటాకు చప్పుళ్లకు ఇక్కడ బెదిరిపోయేవాళ్లు ఎవ్వరూ లేరు. మీరు గత ప్రభుత్వం లో ఇలాంటివి చేశారు కాబట్టే మీకు జనాలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కూర్చోబెట్టారు. అయినప్పటికీ మీలో ఎలాంటి మార్పు లేదు. అసాంఘిక కార్యకలాపాలు, బెదిరింపులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. మేము చట్టబద్దం గా వ్యవహరించాలి కాబట్టి పద్దతిగా ఉంటున్నాం. పిచ్చి వేషాలు వెయ్యాలి చూస్తే తొక్కి నారా తీస్తాం జాగ్రత్త. ఇది మంచి ప్రభుత్వం, కానీ మెతక ప్రభుత్వం మాత్రం కాదు’.
‘పోలీసులను బెదిరిస్తారు,విదేశాల్లో ఉన్నా తీసుకొచ్చి బట్టలు ఊడదీస్తాం అంటారు, అనధికార యంత్రాంగాన్ని బెదిరిస్తారు, వీళ్ళందరికీ నేను ఒక్కటే చెప్తున్నాను. వాళ్ళు వచ్చేది మా ప్రభుత్వమే,మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరి భరతం పడుతాం అంటూ బెదిరించే బెదిరింపులకు భయపడి మీ విధులను నిర్వహించడం మానకండి. చట్ట పరంగా ఎలా అయితే వెళ్లాలో, అలాగే వెళ్ళండి. వాళ్ళ ప్రభుత్వం 2029 లోనే కాదు, ఎప్పటికీ రాదు. రాకుండా చేసే బాధ్యత మాది. మేము ఊరికినే పొత్తు పెట్టుకోలేదు. ఈ పొత్తు కనీసం 15 ఏళ్ళు అయినా ఉండాలని మేమంతా సంకల్పించాము. వికసిత్ భారత్ లో మన ఆంధ్ర ప్రదేశ్ భాగం అయ్యే విధంగా అందరూ కష్టపడి పని చెయ్యాలి’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి. గత రెండు మూడు రోజులుగా జగన్ మాట్లాడిన ‘రప్పా రప్పా’ కామెంట్స్ వైరల్ అవుతున్న ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి కౌంటర్లు ఇవ్వడం పెద్ద చర్చనీయాంశంగా మారింది’.
బ్యానర్లు పట్టుకుని గొంతుకుల్ని కోసేస్తాం అంటే మక్కిలు ఇరగొట్టి కింద కూర్చోపెడ్తాం పిచ్చి వేషాలు వేయకండి
ఆ ప్రభుత్వం మళ్ళీ రాదు రావట్లేదు
– Chief @PawanKalyan
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) June 23, 2025