NTR Dragon movie : ఎన్టీఆర్(Junior NTR) అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘డ్రాగన్'(Dragon Movie). ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో శరవేగంగా సాగుతుంది. ఎన్టీఆర్ పై ఒక పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ పాట భారీ లెవెల్ లో ఉండబోతుంది. ఇందులో వందేమాతరం థీమ్ తో వచ్చే మ్యూజిక్ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుందట. ప్రశాంత్ నీల్ తన ప్రతీ సినిమాకు రవి బర్సూర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటాడు. ఈ చిత్రానికి కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్. అయితే ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోలను యాంటీ హీరోలుగానే ఇది వరకు చూపిస్తూ వచ్చాడు. కానీ నేడు చిత్రీకరిస్తున్న పాటలో వందేమాతరం థీమ్ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా ఉందంటే కచ్చితంగా ఇది దేశ భక్తికి సంబంధించిన సినిమానే అని అంటున్నారు అభిమానులు.
ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రముఖ కన్నడ స్టార్ హీరోయిన్ రుక్మిణీ వసంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమె మన తెలుగు ఆడియన్స్ కి ‘సప్త సాగరాలు ఎల్లో’ చిత్రం ద్వారా పరిచయమైంది. చూసేందుకు ఎంతో ముచ్చటగా అనిపించడమే కాకుండా, అద్భుతమైన నటనను కూడా ఆమె ఈ చిత్రం లో కనబర్చింది. అలాంటి హీరోయిన్ ఎన్టీఆర్ సరసన నటించబోతుండడం పై ఆయన అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గానే రుక్మిణీ వాసంత్ కూడా మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టింది. యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా అట ఇది. ఇందులో ఎన్టీఆర్ ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించినంత మాస్ యాంగిల్ లో చూపించబోతున్నాడట. అభిమానులు మెంటలెక్కిపోవడం గ్యారంటీ అని అంటున్నారు. ఇది కేవలం ఒక భాగంగానే తెరకెక్కుతుందా లేదా రెండు భాగాలుగా తెరకెక్కనుందా అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.
ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ‘వార్ 2’ చిత్రం ఈ ఆగష్టు 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి. ఎన్టీఆర్ కూడా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ని పూర్తి చేశాడు. రీసెంట్ గానే విడుదల చేసిన టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. సినిమాలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల రోజునే సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమాపై బజ్ మామూలు రేంజ్ లో లేదు. ‘వార్ 2 ‘ కూలీ మేనియా ని తట్టుకొని ఎలా నిలబడుతుందో చూడాలి.