Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan) మరో మైలురాయిని దాటారు. సినిమా హీరోనే కాదు రియల్ హీరో అని అనిపించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకుడు ఇలా చేయాలి అనిపించేలా తనకు తాను చూపించుకున్నారు. ఏకంగా గిరిజన ప్రాంతాలకు వెళ్లి వారితో మమేకం అయ్యారు. గత రెండు రోజులుగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని మన్య ప్రాంతంలో పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను ఒక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా గాక.. ఒక ప్రజా ప్రతినిధిని అని భావించక.. ఓ రాజకీయ పార్టీ అధినేతను అనే భావన లేక.. పవన్ కళ్యాణ్ గిరిజనులతో మమేకం అయిన తీరు మాత్రం ఆకట్టుకుంది. వారితోనే నేరుగా జతకట్టి.. వారి ఆచార భాషల్లోనే వారి సమస్యలను తెలుసుకొని.. పరిష్కార మార్గం చూపిన తీరు మాత్రం ఆకట్టుకుంటోంది.
Also Read: ఏపీకి ప్రధాని మోదీ.. అమరావతిని అలా ఫిక్స్ చేసిన చంద్రబాబు!
* పట్టని గిరిజన సంక్షేమం..
దశాబ్దాల ప్రభుత్వాల ఏలుబడిలో గిరిజన సంక్షేమం ( tribal welfare) అనేది పేపర్ మీద రాతగా మిగిలింది. కానీ పవన్ కళ్యాణ్ తన పాలనలో గిరిజనులకు నేరుగా ఫలాలు అందించాలని భావించారు. అందుకే కొండ శిఖర గ్రామాలకు వెళ్లారు. తన భద్రతను పక్కన పెట్టి.. గిరిజనుల క్షేత్రస్థాయి జీవనస్థితిగతులు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కార మార్గాలు సూచించేందుకు పడిన తపన చూస్తుంటే అభినందించక తప్పదు. ఇప్పటివరకు గిరిజన సంక్షేమం అనేది మాటల వరకే కనిపించేది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చేతల రూపంలో చూపించి గిరిజనుల సమస్యల పరిష్కార వారధిగా నిలిచిన తీరు మాత్రం అభినందనలు అందుకుంటోంది.
* ఉద్యమం వైపు ఆకర్షితులై..
గిరిజనులు( tribes) అంటే మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చేవారు. సమస్యలు పరిష్కారం కాక.. ప్రభుత్వాలు పట్టించుకోక.. మౌలిక వసతులు దక్కక.. పాలిత వర్గాల పీడిత జనంగా ఉండి పోయేవారు గిరిజనులు. ఈ క్రమంలో వారికి అక్షరాస్యత లేదు. సమాజం పట్ల ప్రభావితం కాక.. మావోయిస్టుల విప్లవానికి ఆకర్షితులయ్యేవారు. తాము పాలిత పీడిత వర్గాలమని భావించి ఆ ఉద్యమం వైపు అడుగులు వేసేవారు. దానినే అనుసరించేవారు వారి తరువాత తరాలు వారు కూడా. గ్రామానికి రవాణా సదుపాయం లేదు. వైద్యం లేదు. విద్య అందదు. ఈ కారణాలతోనే వారు మావోల ఉద్యమం వైపు అడుగులు వేసేవారు. మావోయిస్టులకు ఆశ్రయం కల్పించేవారు.
* గంజాయి సాగును ప్రోత్సహించి..
గిరిజన ప్రాంతం అంటే అటవీ ఉత్పత్తుల సేకరణ. పోడు వ్యవసాయం. కానీ దానికి మార్కెట్ సదుపాయం లేదు. కల్పించలేరు కూడా. కానీ అదే సమయంలో గంజాయి సాగును మాత్రం వారితో చేయించేవారు. అటవీ ఉత్పత్తుల సేకరణకు మించి వారి చేతిలో డబ్బులు పెట్టేవారు. దానికి 100 రెట్లు లాభం పొందేవారు దళారులు. ఇలా అన్నింట దగా పడిన గిరిజనులకు ప్రభుత్వాలు అండగా నిలిచాయి కానీ. ఆ ఫలాలు వారికి దక్కాయో లేదో అని తెలుసుకునే ప్రయత్నాలు చేసిన ప్రభుత్వాలు లేవు. కనీసం గిరిజన ప్రాంతాల వైపు తొంగి చూసిన దాఖలాలు లేవు. కానీ ఫస్ట్ టైం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ సాహసం చేశారు. గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒకేసారి వందల గ్రామాలకు రవాణా సదుపాయం కల్పించి వారికి దేవుడయ్యారు. పాలకుడు అంటే ఆదేశాలు ఇవ్వడమే కాదు. ఆచరించి చూపడం అనేది పవన్ కళ్యాణ్ నేటి పాలకులకు చేసి చూపించారు.
* గురుతర బాధ్యతగా భావించి..
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టారు పవన్ కళ్యాణ్. కూటమి( Alliance ) అధికారంలోకి రావడానికి కారణం అయ్యారు. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టారు. తనకు దక్కిన గురుతర బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. ఏసీ గదుల్లో కూర్చునేందుకు మాత్రం పరిమితం కాలేదు. తనకు ఇష్టమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆయన అటవీ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనల్లో స్వామి కార్యం తో పాటు స్వకార్యం అన్నట్లుగా సాగారు. వాస్తవానికి తనకు ఇష్టమైన శాఖలో ఒకటైన అటవీ శాఖను తీసుకోవడానికి కారణం గిరిజనులు. ఇప్పటివరకు గిరిజన సంక్షేమం అనేది నేతల నోటి మాట వరకు వచ్చేది. చేతల్లో కనిపించేది కాదు. కానీ దానిని చేసి చూపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిజంగా ఆయన చర్యలకు హాట్సాఫ్. నిజంగా పవన్ కళ్యాణ్ కు సెల్యూట్ కొట్టాల్సిందే.
Also Read: సజ్జల ఔట్.. ఆయన స్థానంలో కొత్త నేతకు జగన్ అవకాశం!