CM Chandrababu: ఏపీలో కూటమి ప్రభుత్వం( Alliance government ) దూకుడు మీద ఉంది. పాలనతో పాటు సంక్షేమ పథకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అమరావతి రాజధాని నిర్మాణం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతికి కొత్త కళ వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్న క్రమంలో అమరావతి నిర్మాణానికి నిధుల సమీకరణ చేయగలిగింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు కేంద్రం కూడా గతానికి భిన్నంగా వ్యవహరించింది. అమరావతి రాజధాని నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించింది. దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో సర్దుబాటు చేసింది. మరోవైపు ఇతర మార్గాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణ పూర్తి చేసింది. ఇవన్నీ ఒక కొలిక్కి రావడంతో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు అట్టహాసంగా ప్రారంభించాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. ఎందుకు సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది.
Also Read: సజ్జల ఔట్.. ఆయన స్థానంలో కొత్త నేతకు జగన్ అవకాశం!
* ఇప్పటివరకు నిధులు.. ఇకనుంచి నిర్మాణాలు
కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. ఇప్పటివరకు అమరావతి రాజధానికి ( Amravati capital) నిధుల సమీకరణ పై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు నిర్మాణాలపై కసరత్తు చేస్తోంది. పలు నిర్మాణాలకు టెండర్లు ఖరారు చేసింది. కీలకమైన ఐకానిక్ టవర్స్ టెండర్లు పిలిచేందుకు సిద్ధమయింది. మరోవైపు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రధాని మోడీ చేతుల మీద శంకుస్థాపన చేయాలని తాజాగా నిర్ణయించారు చంద్రబాబు. వచ్చే వారంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ ఘట్టం అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించింది.
* ఈనెల చివరి వారంలో..
అమరావతి రాజధాని లో నవ నగరాలు( nine cities ) నిర్మించాలన్నది చంద్రబాబు లక్ష్యం. కానీ 2019 నుంచి 2014 మధ్య అధికార మార్పిడితో ఆ లక్ష్యం నీరుగారిపోయింది. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడం.. కేంద్రంలోనూ టిడిపి కీలక భాగస్వామి కావడంతో అమరావతికి కేంద్ర పెద్దలు సహాయం అందిస్తున్నారు. అందుకే ప్రపంచానికి చాటి చెప్పే విధంగా అమరావతి నవ నగరాలు నిర్మించాలన్నది చంద్రబాబు ప్లాన్. వాటికి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ఈనెల 23 లేదా 24 తేదీల్లో అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. నాడు నరేంద్ర మోడీతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం హాజరయ్యారు. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడంతో దాయాది రాష్ట్ర పాలకుడిగా అప్పట్లో కెసిఆర్ హాజరయ్యారు. ఈసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సైతం ఆహ్వానం పంపే అవకాశం కనిపిస్తోంది.
* భారీగా ఐకానిక్ భవనాలు..
ఇక అమరావతిలో పలు నిర్మాణాలకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి. ఐకానిక్ భవనాల( iconic buildings ) కోసం టెండర్లు ప్రక్రియ పూర్తి చేశారు. ఇంకా మిగిలి ఉన్న ముఖ్యమైన పనులకు టెండర్లు పిలిచే పనిలో సీఆర్డీఏ అధికారులు ఉన్నారు. అమరావతి ప్రభుత్వ సముదాయంలోనే అత్యంత కీలకమైన ఐకానిక్ టవర్లకు వచ్చేవారం టెండర్లు పిలవనున్నారు. ఐదు టవర్ల నిర్మాణానికి ప్రస్తుత ధరల మేరకు రూ.4,687 కోట్లతో చేపట్టడానికి పాలనాపరమైన ఆమోదం తెలిపారు. మొత్తానికి అయితే అమరావతిలో కీలక ఘట్టానికి ఈనెల చివరి వారం వేదిక కానుంది.