Pawan Kalyan Statement: ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఇప్పట్లో మారే అవకాశం కనిపించడం లేదు. ఇది ఒక విధంగా జనసైనికులకు షాక్ ఇచ్చే విషయం. అంతకుమించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళన కలిగించే పరిణామం. చంద్రబాబు విషయంలో పవన్ కళ్యాణ్ నోటి నుంచి విభిన్న ప్రకటనలు వస్తే.. శ్రావ్యంగా వింటామన్న రీతిలో వైసీపీ నేతలు ఉన్నారు. కానీ అది ఎప్పుడు జరగడం లేదు. ఒకటి రెండు సార్లు పవన్ ప్రకటనలు భిన్నంగా కనిపించినా చంద్రబాబు నాయకత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు ఎన్నడూ చేయలేదు. పొరపాటున కూడా ఆయన నోటి నుంచి ఇంతవరకు రాలేదు.
Also Read: సినిమా డైలాగ్లు చెప్పను.. పవన్ కు నచ్చనిది అదేనట..
సంచలన వ్యాఖ్యలు
తాజాగా సీఎం చంద్రబాబు విషయంలో భక్తి, భయం కలగలిపిన గౌరవాన్ని వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan). ప్రకాశం జిల్లాలో జలజీవన్ మిషన్ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నడూ తెలుగుదేశం పార్టీని తక్కువ చేయలేదని చెప్పుకొచ్చారు. ఏ సందర్భంలో కూడా తప్పుగా మాట్లాడలేదన్నారు. చంద్రబాబు అనే నేత లేకపోతే ఈ రాష్ట్రం ఆర్థికంగా గాడిన పడే అవకాశం లేదని తేల్చి చెప్పారు. తనకు పోరాటం చేసే శక్తి ఉందని.. పాలించే అనుభవం ఇంకా రాలేదని గుర్తు చేశారు పవన్. చంద్రబాబు చొరవ వల్లే ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. తద్వారా ఇప్పట్లో తమ మధ్య విభేదాలు వస్తాయని అనుకోవద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి సంకేతాలు పంపారు. అయితే సహజంగానే చంద్రబాబు నాయకత్వాన్ని పొగడడం, తనకు అనుభవం లేదని చెప్పడం జనసైనికులకు మింగుడు పడటం లేదు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో జనసైనికులు పడకుండా పవన్ కళ్యాణ్ ఇలా భిన్నంగా ప్రకటనలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: టీడీపీని తక్కువ చేసి మాట్లాడలేదు.. పవన్ హాట్ కామెంట్స్
ఇప్పటికీ అదే గౌరవం..
అయితే చంద్రబాబు సీనియారిటీని గౌరవిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎట్టి పరిస్థితుల్లో మరోసారి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. అలా ప్రజలను అప్రమత్తం చేసే తరుణంలో చంద్రబాబు నాయకత్వాన్ని మరింతగా సమర్థిస్తున్నారు. తద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణుల నమ్మకాన్ని, అభిమానాన్ని చూరగొంటున్నారు. అదే సమయంలో జనసైనికులు లేనిపోని ప్రకటనలకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. అంతిమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పెడుతున్నారు. మొత్తానికి అయితే చంద్రబాబు విషయంలో పవన్ ఆది నుంచి ఇదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. 2029 ఎన్నికల వరకు ఇదే మాదిరిగా వ్యవహరిస్తారని స్పష్టమవుతుంది. తద్వారా వైసిపికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వకూడదని మాత్రం ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తున్నారు.
నేనెప్పుడూ టీడీపీని తక్కువ చేసి మాట్లాడలేదు
చంద్రబాబు నాయుడు లేకపోతే రాష్ట్రం ఇంత ప్రణాళికాబద్ధంగా నడిచేది కాదు
కూటమి ప్రభుత్వంలో అందరూ సమానమే, అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి అవుతుంది – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/ehvFv6hMTp
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2025