ChatGPT helps US woman: టెక్నాలజీ వాడకం పెరిగిపోతోంది. టెక్నాలజీ రకరకాల రూపులు సంతరించుకోవడం కూడా పెరిగిపోతుంది. అందువల్లే ఒకప్పుడు కొత్తగా ఉన్నది ఇప్పుడు పాతది అయిపోయింది. భవిష్యత్తు అవసరాలను తీర్చే టెక్నాలజీ ఇప్పుడు కొత్తది అయిపోయింది. అందువల్లే నేటి సమాజం కేవలం కొత్త దాని చుట్టూ మాత్రమే తిరుగుతోంది. అందులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఈ జాబితాలో ఓ మహిళ కూడా ఉంది. అయితే ఆమె టెక్నాలజీని ఉపయోగించి అద్భుతం చేసింది. 30 రోజుల్లో 10 లక్షల అప్పు తీర్చేసింది.
నేటి కాలంలో కృత్రిమ మేధకు సంబంధించిన చాట్ బాట్ లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే చాట్ బాట్ ఉపయోగించి ఓ మహిళ తన ఆర్థిక కష్టాల నుంచి బయటపడింది. ఇప్పుడు ఆమె సాధించిన విజయం విస్తృతంగా చర్చకు కారణమవుతోంది. అమెరికాలోని డెలా వేర్ ప్రాంతానికి చెందిన జెన్నిఫర్ అలెన్ స్థిరాస్తి వ్యాపారిగా పనిచేస్తున్నారు. ఆమె కంటెంట్ క్రియేటర్ గా కూడా పనిచేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అయితే ఈమెకు ఆర్థిక క్రమశిక్షణ అంతంత మాత్రమే. విపరీతంగా ఖర్చు పెడుతుంటుంది. ఇటీవల ఆమె వివాహం చేసుకుంది. ఒక బిడ్డకు తల్లి కూడా అయింది. ఆర్థిక క్రమశిక్షణ సరిగా లేకపోవడంతో ఆమె ఇబ్బందులు ఎదుర్కొక తప్పదలేదు. మొత్తంగా 20 లక్షల వరకు అప్పులయ్యాయి. అయితే ఆమె సంపాదన సక్రమంగానే ఉన్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి.. ముఖ్యంగా బిడ్డ పుట్టిన తర్వాత జెన్నిఫర్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. బిడ్డ వైద్య ఖర్చులు.. గృహ అవసరాలు.. ఆమె ఖర్చులు కూడా పెరిగిపోయాయి.. దీంతో క్రెడిట్ కార్డు పై ఆధారపడక తప్పలేదు..
Also Read: అంగరంగ వైభవంగా జెఫ్ బెజోస్, లారెన్ వివాహం.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో తెలుసా?
అలాగని జెన్నిఫర్ దుబారా ఖర్చులు చేయలేదు. క్రెడిట్ కార్డు ద్వారా అన్ని ఖర్చులకు డబ్బులు ఇచ్చేది. దీంతో అప్పులు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ఇదంతా కూడా జెన్నీఫర్ కు తెలియకుండానే జరిగిపోయింది. ఆర్థిక పరిస్థితులు చేయి దాటిపోతున్న నేపథ్యంలో.. ఒకసారి గా జెన్నీఫర్ లో ఆలోచన మొదలైంది.. ఈ నేపథ్యంలో తనకు ఏదైనా సలహా ఇవ్వాలని చాట్ జిపిటిని జెనీఫర్ సలహా అడిగింది. చాట్ జిపిటి ఎదుట తనకు వచ్చే రాబడి.. పెట్టే ఖర్చులు.. ఉన్న ఆస్తులు.. చేసిన అప్పులు.. ఇవన్నీ కూడా చాట్ జిపిటి ఎదుట జెన్నీఫర్ ఉంచింది. వివరాల మొత్తం పరిశీలించిన చాట్ బాట్.. జెన్నీఫర్ కు ఆర్థిక ప్రణాళికను రూపొందించి ఇచ్చింది. దానిని జెన్నీ ఫర్ అమలు పెట్టింది..
ఆ ప్రణాళిక ప్రకారం ఆమె ఖర్చులను తగ్గించలేదు. కాకపోతే వృధాను పూర్తిగా తగ్గించింది. తను విస్మరించిన ఖాతాలను పరిశీలించింది. అందులో పోగు పడిన డబ్బులను వెనక్కి తెచ్చుకుంది. ఉపయోగం లేని వాటిని పక్కన పెట్టింది. అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించేసింది. దీంతో నెలరోజుల్లోనే ఆమె డబ్బును పొదుపు చేయగలిగింది. 20 లక్షల అప్పుల్లో పది లక్షల వరకు తీర్చేసింది. మరో 30 రోజుల్లో మిగతా పది లక్షల అప్పులు కూడా తీర్చేస్తానని ఆమె చెబుతోంది. ” ఖర్చులు పూర్తిగా తగ్గించాను. అలాగని అవసరమైన వాటిని పక్కన పెట్టలేదు. వృధాగా పెడుతున్న ఖర్చులను పూర్తిగా దూరంపెట్టాను. దానివల్ల డబ్బు ఆదా అయింది. అంతేకాదు అప్పు కూడా తీరుతోందని” జెన్నీఫర్ వ్యాఖ్యానించింది..